
ట్యాబ్లెట్లను ప్యాక్ చేసేందుకు అల్యూమీనియం వాడే విషయం మన అందరికీ తెలిసిందే.. కానీ ఆ ఫాయిల్‌నే ఎందుకు వాడుతారో మీకు తెలుసా? ఇది కేవలం నీట్‌గా కనిపించడానికి మాత్రమే కాదు, దాని వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం కూడా ఉందట. ఎక్కువ రోజులు గడిచినా టాబ్లెట్ల నాణ్యత, వాటి ప్రభావం, స్థిరత్వం తగ్గకుండా, పర్యావరణ కారకాల నుంచి ఔషదాలకు రక్షణ కల్పిండంలో ఈ ఫాయిల్ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఔషధాల ప్యాకేజింగ్ అనేది తేమ, కాంతి, ఆక్సిజన్ వంటి రసాయన వాయువులకు ప్రభావితం కాకుండా ఉండేలా చేయాలి. ఎందుకంటే ప్యాకింగ్ అనేది అలా కనుక లేకపోతే దీర్ఘకాలంలో మందుల నాణ్యతను తగ్గే ప్రమాదం ఉంది. అల్యూమినియం ఫాయిల్‌కు వీటన్నింటిని తట్టుకొని.. ఔషదాలను సేఫ్‌గా ఉంచే గుణం ఉంది. అందుకే ట్యాబ్లెట్స్ పాకింగ్‌లో ఎక్కువగా అల్యూమీనియం పాయిల్‌ను వాడుతారు.

అయితే కొన్ని రకాల ఔషదాలకు తేమ లేదా గాలి తగిలితే వాటిలో భౌతిక, రసాయన మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఆక్సిజన్, వెలుతురు వల్ల వాటి నాణ్యత కూడా క్షీణిస్తుంది. అయితే ఇక్కడ మీరు మరో విషయం గుర్తుంచుకోవాలి. అన్ని ఔషదాలకు ఒకేరకమైన ప్యాకింగ్‌ను వాడరు. ఔషదాల రసాయన స్వభావం, స్థిరత్వాన్ని బట్టి వాటిని ప్యాకింగ్ చేసే విధానం మారుతుంది.

కొన్ని ట్యాబ్లెట్స్ నార్మల్ టెంపరేచర్‌లోనే స్థిరంగా ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం తేమ లేదా కాంతికి త్వరగా ప్రభావితం అవుతాయి. ఏ మందులకైతే తేమ, కాంతి నుంచి రక్షణ అవసరమో వాటిని ఎక్కువగా అల్యూమీనియం ఫాయిల్‌తో కూడి స్ట్రిప్‌లో ప్యాకింగ్ చేస్తారు. వాటి స్వభావాన్ని బట్టి ఒకవైపు ప్లాస్టిక్ లేదా ఇతర పదార్థాలు, మరోవైపు అల్యూమినియం ఫాయిల్ ఉండేలా ప్యాకింగ్ చేస్తారు.

అయితే, అల్యూమినియం ఫాయిల్ వాడినంత మాత్రాన ఆ ట్యాబ్లెట్స్ ఎక్కవ కాలం సరక్షితంగా ఉంటాయని కాదు.. వాటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ ముందుల స్వభవాన్ని బట్టి వాటికి కొంత టైం ఫిక్స్ చేసి.. ఆ టైం లోపు వాటిలో ఎలాంటి మార్పులు రాకుండా ప్యాకింగ్ విధానాన్ని అమలు చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే, ఈ అల్యూమీనియ ఫాయిల్ అనేది తేమ, కాంతి, ఆక్సిజన్ వంటి వాటి నుంచి మందులను కాపాడే ఒక రక్షణ కవచం.