ధర తగ్గిందిగా.. బంగారం కొంటున్నారా? అయితే, మీరు కొన్న నగలు ఈ గులాబీ కాగితంలోనే ఎందుకు చూడతారో తెలుసుకోండి!

Updated on: Mar 26, 2026 | 6:24 PM

బంగారు లేదా వెండి ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు షాపు వారు వాటిని ఎప్పుడూ గులాబీ రంగు (Pink) కాగితంలోనే ఎందుకు చుట్టి ఇస్తారో మీకు తెలుసా? అవును.. మనం కొత్తగా నగలు కొన్నప్పుడు జ్యువెలరీ షాపు వారు వాటిని ఒక గులాబీ రంగు పేపర్‌లో చుట్టి బాక్సులో పెడతారు. ఇది మీరు గమనించే ఉంటారు. బంగారు షాపులో నగలు కొన్న తర్వాత, వారు ఇచ్చే ప్యాకింగ్‌లో గులాబీ కాగితం ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం అలంకారం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్, సైకలాజికల్ కారణాలు ఉన్నాయని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.

1 / 6
బంగారు షాపులో నగలు కొన్న తర్వాత, వారు ఇచ్చే ప్యాకింగ్‌లో గులాబీ కాగితం ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం అలంకారం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఆభరణాల ప్రియులు తప్పక తెలుసుకోవాలి. లేదంటే, మీకే లాస్‌ అంటున్నారు బంగారు, వెండి ఆభరణాల నిపుణులు.

2 / 6
ఆకర్షణీయమైన లుక్ (Visual Appeal): రంగుల శాస్త్రం (Color Psychology) ప్రకారం, గులాబీ రంగు ఆభరణాల పసుపు (బంగారం) లేదా తెలుపు (వెండి) రంగులను మరింతగా ఎలివేట్ చేస్తుంది. నలుపు లేదా తెలుపు కాగితం కంటే గులాబీ రంగులో ఉంచినప్పుడు నగలు కంటికి మరింత ఖరీదైనవిగా, అందంగా కనిపిస్తాయి.

3 / 6
రంగు మారకుండా ఉండటానికి (Oxidation Control): వెండి, కొన్ని రకాల బంగారు ఆభరణాలు గాలిలోని సల్ఫర్, తేమ తగిలితే త్వరగా నల్లగా మారుతాయి. గులాబీ రంగు కాగితం ఈ తేమను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఒక రక్షణ పొరలా ఉండి, నగలు చాలా కాలం పాటు కొత్తవాటిలా మెరిసేలా చేస్తుంది.

4 / 6
యాసిడ్ ఫ్రీ పేపర్ (Acid-Free Quality): సాధారణ వార్తాపత్రికలు లేదా ఇతర కాగితాల్లో రసాయనాలు, యాసిడ్స్ ఉండవచ్చు. ఇవి లోహాలతో చర్య జరిపి వాటిపై మచ్చలు పడేలా చేస్తాయి. కానీ, నగల కోసం వాడే ఈ పింక్ పేపర్లు యాసిడ్ ఫ్రీగా ఉంటాయి. ఇవి లోహానికి ఎలాంటి హాని చేయవు.

5 / 6
మృదుత్వం (Softness): ఈ కాగితం చాలా మెత్తగా ఉంటుంది. దీనివల్ల సున్నితమైన ఆభరణాలపై గీతలు (Scratches) పడకుండా ఉంటాయి. ఒక బాక్సులో రెండు మూడు రకాల నగలు ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి తగలకుండా ఈ కాగితం రక్షిస్తుంది.

6 / 6
అంతేకాదు..ఇది ఒక మార్కెటింగ్ ట్రిక్ కూడా. గులాబీ రంగు ఆభరణాల మెరుపును మరింత స్పష్టంగా, ఆకర్షణీయంగా చూపిస్తుంది. వినియోగదారుడికి ఆ నగను చూడగానే ఒక సానుకూల భావన (Positive Feeling) కలుగుతుంది. అందుకే మీరు ఇంట్లో నగలు దాచుకునేటప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, ఇలాంటి గులాబీ కాగితంలో చుట్టి ఉంచడం వల్ల అవి ఎక్కువ కాలం కొత్తవిలా మెరుస్తాయి.

Follow Us