
భారత దేశంలో అనేక నగరాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని అక్కడి ప్రత్యేకమైన ప్రదేశాలు, చారిత్రక దేవాలయాలకు ప్రసిద్ధి చెందినవి, మరికొన్ని రాజభవనాలు, పర్వతాలు, పచ్చని ప్రకృతి వంటి వాటితో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాయి. అయితే ఒక ప్రాంతం మాత్రం ఎలాంటి ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ స్వర్ణ నగరంగా కొనసాగుతుంది. బంగారంతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, దానిని స్వర్ణ నగరం అని అంటారు. మరి మీకు దీని గురించి తెలుసా?

రాజస్థాన్‌లో ఉన్న నగరాల్లో జైసల్మేర్ కూడా ఒకటి. అయితే ఈ నగరానికి బంగారంతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, దీనిని స్వర్ణ నగరం అని పిలుస్తారు. అయితే ఇలా పిలవడానికి కూడా ఒక కారణం ఉన్నదంట, అది ఏమిటి అంటే? ముఖ్య కారణం ఇక్కడ చాలా పెద్ద పెద్ద కోటలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించడం వలన, వీటిపై సూర్య కాంతి పడినప్పుడు అవి బంగారంలా మెరుస్తాయంట. అందువల్లనే దీనిని స్వర్ణనగరం అని పిలుస్తారంట.

అక్కడ ఉన్న ప్రతి కోట బంగారంలా మెరిసిపోతుందంట. అంతే కాకుండా ఈ ప్రదేశంలో అనేక అందమైన కోటలు ఉన్నాయి. అవి కూడా సమయానుగుణంగా తమ రంగును మార్చుకుంటాయి. ఉదయం సమయంలో లేత బంగారు వర్ణం, మధ్యాహ్నం సమయంలో ప్రకాశవంతమైన పసుపు రంగు, సూర్యాస్తమయం సమయంలో గాఢమైన బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయంట. అందువలన చాలా మంది దీనిని బంగారు లేదా స్వర్ణ నగరం అని పిలుస్తారంట.

ఇక జైసల్మేర్ అనేది బంగారు రంగు, స్వర్ణ నగరం అనే పేరుకే కాకుండా, ఇది దాని సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వారు రంగు రంగుల తలపాగాలు, ఘాగ్రా చోళీ, రాజస్థానీ ఆభరణాలు ధరించి, రాజస్థానీ వస్త్రధారణతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది.

ముఖ్యంగా ఇక్కడి సంస్కృతి ని చూసి, ఇక్కడి ప్రతి సున్నపు రాయి, బంగారు వర్ణం కలిగిన కోటలు రాజస్థాన్ రాజపుత్రలు శౌర్యం కథను తెలియజేస్తుందంట. అందుకే దీనిని స్వర్ణ నగరం అని పిలుస్తారు. ఇక జైసల్మేర్ అనేది ఒక ఎడారి ప్రాంతం. కాబట్టి చాలా వరకు దీనిని సందర్శించాలి అనుకునే వారు వర్షాకాలం లేదా శీతాకాలంలో ఆ ప్రదేశాన్ని సందర్శించడం చాలా మంచిది.