Digestive Biscuits: ఆరోగ్యానికి మంచిది కదాని డైజెస్టివ్ బిస్కెట్లు మీరూ తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి

|

Jul 26, 2024 | 8:30 PM

ఆకలిగా అనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేవి బిస్కెట్లు. ఇష్టమని ప్రతిసారీ క్రీమ్, చాక్లెట్ బిస్కెట్లు తినలేరు. నిజానికి, బిస్కెట్లు ఆరోగ్యకరం అని చాలా మంది అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. చాలా బిస్కెట్లు మైదా పిండితో తయారు చేస్తారు. ఈ పిండితో చేసిన ఆహారం శారీరక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. అందుకే చాలామంది డైజెస్టివ్ బిస్కెట్లు తినేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ బిస్కెట్లు నిజంగా ఆరోగ్యకరమా?

1 / 5

2 / 5
డైజెస్టివ్ బిస్కెట్లలో తక్కువ పిండి ఉంటుంది. బదులుగా వీటిని తృణధాన్యాలతో తయారు చేస్తారు. ఈ రకమైన బిస్కెట్లను ఓట్స్, జోవర్, మిల్లెట్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ రకమైన బిస్కెట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి డైజెస్టివ్ బిస్కెట్లు తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు 2-3 డైజెస్టివ్ బిస్కెట్లు తింటే కడుపు నిండుతుంది.

3 / 5
ఇందులో తక్కువ మొత్తంలో మైదా పిండితోపాటు,  డైజెస్టివ్ బిస్కెట్లలో నూనెను కూడా ఉపయోగిస్తారు. రుచి కోసం కొంచెం చక్కెరను జోడిస్తారు. అందువల్ల వీటిల్లో ఉపయోగించే పదార్ధాలను బట్టి.. డైజెస్టివ్ బిస్కెట్లు ఆరోగ్యకరమైనవని పూర్తిగా చెప్పలేం.

4 / 5
పిండి, నూనె, పంచదార ఈ పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. వాటితో తయారుచేసిన బిస్కెట్లు శరీరానికి చాలా కేలరీలను అందిస్తాయి. అంతేకాకుండా, ఈ రకమైన బిస్కెట్లలో సోడియం, కొవ్వు కూడా ఉంటాయి. డైజెస్టివ్ బిస్కెట్లను రెగ్యులర్ గా తింటే బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఇందులోని సోడియం, కొవ్వు వల్ల శరీరంలో వివిధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డైజెస్టివ్ బిస్కెట్లను మోతాదుకు మించి తినరాదు.

5 / 5
డైజెస్టివ్ బిస్కెట్లను ప్యాక్ రూపంలో విక్రయిస్తారు. అందువల్ల ఈ బిస్కెట్లను తాజాగా ఉంచడానికి వ్యాపారస్తులు వివిధ రకాల పదార్ధాలు కలుపుతారు. అందుకే ప్యాక్ చేసిన, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు.