
బోటీ కూర రెసిపీకి కావాల్సిన పదార్ధాలు: 500 గ్రాముల బోటీ, మూడు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా, నూనె, ఇంకా సరిపడా నీటిని తీసుకోవాలి.

బోటీ కూర తయారి విధానం: బోటీని బాగా కడిగి కుక్కర్‌లో వేసి దానిలో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత నీళ్ళు పోసి 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. పాన్ లో ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇంకా దీనిలో టమాటాలు వేసి అవి మెత్తబడే వరకు బాగా కలపాలి.

బోటీ కూర తయారి విధానం స్టెప్ 1 : ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. కొద్దీ సేపటి తర్వాత ఈ ఉడికిన బోటీని వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీడియం మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకా దీనిలో గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కిందకు దించుకోవడమే.

మటన్ తలకాయ కూరకు తయారీ విధానం: ముందుగా తలకాయ ముక్కలు తీసుకుని బాగా కడిగి దీనిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా నీరు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు వీటినిన్ బాగా ఉడికించాలి. పెద్ద పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

మటన్ తలకాయ కూరకు తయారీ విధానం స్టెప్ 1 : ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా నాలుగు టమాటాలు కూడా వేసి వాటిని మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఇంకా ఇప్పుడు కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా వేయించాలి. చివర్లో ఉడికిన తలకాయ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు ఉంచి కిందకు దించుకోవాలి.