
సాధారణంగా సామాన్య ప్రజలు దేశాల సరిహద్దు ప్రాంతాలను చూడలేరు. వాటిని మన కేవలం సినిమాల్లో, లేదా టీవీలలో మాత్రమే తరచూ చూస్తూ ఉంటాం. అప్పుడు సరిహద్దు వెంబడి ఉన్న కంచెలకు అక్కడక్కడ గాజు సీసాలు కట్టి ఉండడం మీరు గమనించే ఉంటారు. కానీ వాటిని అలా ఎందుకు వేలాడదీశారో మీరు ఆలోచించారా? దీని వెనక పెద్ద కథే ఉంది. ఇవి చూడ్డానికి నార్మల్‌గానే దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవును ఇవి సైనికులకు అలారంగా పనిచేస్తాయి.

ఖాళీ సీసాలు ఎలా ఉయోగపడుతాయి: సరిహద్దు ప్రాంతాల్లోని కంచెలకు ఈ సీసాలను దగ్గరగా ఒకదానికి ఒకటి తగిలేలా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎవరైనా శ్రువులు కంచెలను కత్తింరించాలని ప్రయత్నించినా, లేదా వాటిని దాటాలని ప్రయత్నించినా, కనీసం కంచెను తాకినా తీగలు కదిలి కంచెకు ఉన్న సీసలు ఒకదానికి ఒకటి తగులుతాయి. ఇలా రెండు సీసలు ఒకదానికి ఒకటి తగిలినప్పుడు ఒక రమైన టిన్ టిన్ అనే శబ్ధం వస్తుంది. సరిహద్దు ప్రాంతాలు నిశబ్ధంగా ఉంటాయి కాబట్టి ఈ శబ్ధం చాలా దూరం వరకు వినిపిస్తుంది. దీంతో సైనికులు అప్రమత్తమై అలర్ట్‌గా ఉంటారు.

ఖాళీ సీసాలనే ఎందుకు ఉపయోగిస్తారు: ఏ దేశానికైనా సరిహద్దులు ప్రాంతాలు అడవులు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో అదునాతన టెక్నాలజీతో పనిచేసే సెన్సార్లను ఉపయోగించడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లోనే ఎలాంటి విద్యుత్ సరఫరా అవసరం లేకుండా అలారంగా పనిచేసే ఈ ఈ గాజు సీసాలను ఉపయోగిస్తారు. ఇవి ఎంతటి కఠిన వాతావరణం పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేస్తాయి.

తక్కవ ఖర్చు, ఎక్కవు ప్రయోజనం: సాధారణంగా హైటెక్ టెక్నాలజీతో రూపొందించిన థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, లేజర్ అలారాలతో కూడిన పరికరాలతో పోలిస్తే ఈ గాజు సీసాలు చాలా సులభంగా, చవకగా లభిస్తాయి. అంతేకాదు వీటిని ఏర్పాటు చేయడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనికూడా లేదు. అంతే కాదు వీటికి ఎలాంటి విద్యుత్ అవసరం లేదు. ఎలాంటి సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో సైతం ఇవి సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో శీతాకాలంలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీని కారణంగా విజిబిలిటీ అనేది దాదాపు శాన్యంగా ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన కెమెరాలు సైతం చొరబాటుదారులను గుర్తించలేవు. అలాంటి సందార్భాల్లో సైనికులు ఈ ఖాళీ సీసాల ద్వారా వచ్చే శబ్ధాల ఆధారంగానే అప్రమత్తం అవుతూ ఉంటారు.