Fish: నాకేం కాదులే అనుకుంటే అంతే సంగతులు.. చేపలు వీళ్లకు యమ డేంజర్..

Updated on: Sep 22, 2026 | 5:22 PM

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది కాదనలేని సత్యం. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, అధిక ప్రొటీన్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. అందుకే చాలామంది తమ ఆహారంలో చేపలకు ప్రత్యేక స్థానం కల్పిస్తుంటారు. అయితే అందరికీ అమృతంగా భావించే ఈ ఆహారం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

1 / 5
ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు చేపలు తినే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితులు, క్యాన్సర్‌కు కీమోథెరపీ చేయించుకుంటున్నవారు, అలాగే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారి శరీరంలో ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు పచ్చి చేపలు లేదా సరిగ్గా ఉడకని చేపలను తీసుకుంటే, వాటిలో ఉండే బ్యాక్టీరియా, పరాన్నజీవులు వేగంగా శరీరంలోకి ప్రవేశించి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారితీసే ముప్పు ఉంది. కాబట్టి వీరు బాగా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

2 / 5
రక్తపోటు, గుండెజబ్బులు లేదా పక్షవాతం నివారణ కోసం రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు కూడా చేపల వినియోగంలో ఆచితూచి వ్యవహరించాలి. సాధారణంగా చేపల్లో సహజసిద్ధంగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తం గడ్డకట్టకుండా చూసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అప్పటికే బ్లడ్ థిన్నర్ మందులు వాడుతున్నవారు చేపలను అధిక మోతాదులో తీసుకుంటే, బ్లీడింగ్ రిస్క్ మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్న గాయమైనా రక్తం ఆగకుండా పోయే పరిస్థితి తలెత్తవచ్చు కాబట్టి వీరు వైద్యుల సూచన మేరకు మితంగా మాత్రమే తినడం మంచిది.

3 / 5
కీళ్లవాతం లేదా శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి కూడా చేపలు ఎల్లప్పుడూ మంచివి కావు. కొన్ని రకాల చేపలలో ప్యూరిన్ అనే రసాయన సమ్మేళనం అత్యధిక మోతాదులో ఉంటుంది. ఈ ప్యూరిన్ శరీరంలో విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇది కాళ్ల వేళ్లు, చీలమండలు, మోకాళ్ల కీళ్లలో స్పటికాలుగా మారి తీవ్రమైన నొప్పి, వాపును కలిగిస్తుంది. అందువల్ల తీవ్రమైన కీళ్ల సమస్యలు ఉన్నవారు ప్యూరిన్లు ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండటం లేదా వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది.

4 / 5
ఆహార ఎంపికలో అవగాహన లోపమే చాలా సందర్భాల్లో కొత్త అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. సహజ పోషకాహారమే అయినప్పటికీ, ఒకరి శరీర తత్వానికి నప్పినది మరొకరికి హాని చేయవచ్చు. ముఖ్యంగా ముందస్తు వ్యాధులతో మందులు వాడుతున్న రోగులు తాము తినే ఆహారం తమ చికిత్సపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం చాలా అవసరం.

5 / 5
ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నవారు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల లేదా న్యూట్రిషనిస్టుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఏ చేపలు తినాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, వాటిని ఎలా వండుకోవాలనే విషయాలపై స్పష్టత ఉంటేనే చేపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సురక్షితంగా పొందగలరని నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us