శరీరంలో ఏ అవయవం ఎక్కువగా పనిచేస్తుందో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు..

Updated on: Feb 17, 2026 | 1:39 PM

మన శరీరంలోని అతిముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి రక్తంలోని విషతుల్యాలను తొలగించడం వరకు సుమారు 500 పైగా విధులను ఇది నిర్వహిస్తుంది. అయితే కాలేయం దెబ్బతిన్నప్పుడు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటుంటారు. కాలేయాన్ని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి వైద్య నిపుణులు సూచిస్తున్న కీలక మార్పులు ఇవే..

1 / 5
ఆహారమే ఔషధం: కాలేయ ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, నాణ్యమైన ప్రోటీన్లు తీసుకోవడం వల్ల కాలేయం చురుగ్గా పనిచేస్తుంది. అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించాలి. ఇవి కాలేయంపై భారాన్ని పెంచుతాయి.

2 / 5
 ఫ్యాటీ లివర్ ముప్పు: శరీర బరువు పెరిగితే కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

3 / 5
ఒత్తిడిని తగ్గించుకోండి: ఎక్కువ కాలం ఒత్తిడికి గురవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పరోక్షంగా కాలేయంపై ప్రభావం చూపుతుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, యోగా ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం కాలేయానికి చాలా అవసరం.

4 / 5
నీరే సహజ క్లెన్సర్: శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా తగినంత నీరు త్రాగాలి. అయితే సోడాలు, చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్ వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

5 / 5
చిన్నపాటి జీవనశైలి మార్పులు, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా కాలేయాన్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు..

Follow Us