కుక్క మీపైకి మొరిగినా.. తరిమినా .. తప్పక చేయాల్సిన పనులివే!

Updated on: Sep 22, 2026 | 5:15 PM

కుక్కలు అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది వీటిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు.అయితే కొన్ని సార్లు మన దారిన మనం పోతున్నా సరే కుక్కలు తరమడం, చూసి మొరగడం లాంటిది చేస్తుంటాయి. దీంతో చాలా మంది వణికిపోతుంటారు. ఇంకెంత మంది అయితే కుక్క మొరిగితే చాలు భయంతో పారిపోతుంటారు. కానీ ఇలా చేయకూడదంట. అసలు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
ఏదైనా పని మీద బయటకు వెళ్లి వీధి వెంట నడుస్తూ వెళ్తుంటే కొన్ని సార్లు కుక్కలు చూసి మొరుగుతూ ఉంటాయి. దీంతో చాలా మంది భయంతో పరిగెత్తుతుంటారు. దీని వలన కొన్ని సార్లు కుక్క కూడా వారి వెంట పరిగెత్తడం జరుగుతుంది. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది. అందువలన మీ ముందు కుక్క ఉన్నప్పుడు దాని ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా మంచిది అని చెబుతన్నారు నిపుణులు.

2 / 5
మీరు నడుస్తూ వెళ్తున్న సమయంలో మీకు పరిచయం లేని కుక్క మీ వైపు వస్తుంటే ఎప్పుడూ కూడా మీరు పారిపోకూడదు. చాలా వరకు లోతైన శ్వాస తీసుకొని, ప్రశాంతంగా ఉండాలి. అంతే కాకుండా గట్టిగా అరవడం చేయకూడదు. కుక్క కళ్లలోకి నేరుగా చూడకండి, మీ శరీరాన్ని పక్కకు వంచుతూ నెమ్మదిగా వెనక్కు వెళ్లాలి. కుక్కను తాకకూడదు, దానిని బెదిరించకూడదు. వీలైతే మీ చేతిలో ఏదైనా ఉంటే, దానిని మధ్యలో పెట్టి, దూరాన్ని పాటించాలి.  దాని వలన అది వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.

3 / 5
అలాగే ఒక వేళ కుక్క మీపై దూకుడుగా ప్రర్తిస్తే, కొట్టడానికి ప్రయత్నించకుండా, అసలు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేదానిపై దృష్టి పెట్టాలి. ఒక వేళ మిమ్మల్ని కుక్క తరిమితే దానికి మీకు దూరం ఉండేలా చర్యలు తీసుకోండి. అలాగే కుక్క తరమడం వలన మీరు కింద పడితే పోతే తప్పకుండా చదునుగా పడుకోకుండా బంతిలో ముడుచుకోండి. దీని వలన చేతులు, తల , మెడ, చెవులు వంటి సున్నితమైన భాగాలను రక్షించుకోవచ్చును.

4 / 5
ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ కూడా పిల్లలను ఒంటరిగా బయటకు పంపించకూడదు. కుక్కల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నించిన, యజమానిని అనుమతి తీసుకోవాలి. చాలా వరకు కుక్కల వద్దకు పిల్లలు వెళ్లకుండా చూసుకోవడమే చాలా మంచిది.

5 / 5
అంతే కాకుండా పెంపుడు కుక్కలపై కూడా యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  బయటకు వెళ్లినప్పుడు దాని ప్రవర్తన, దానిని నియంత్రించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా కుక్కకు సమయానికి టీకా వేయించడం వలన ఇతరులకు హాని ఉండదు.  అంతే కాకుండా మీకు కుక్క కాటు లేదా గోరుతో గాయం చేసినా, తప్పకుండా దానిని సబ్బుతో శుభ్రం చేసి, టీకా వేయించుకోవడం చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

Loading...
Unable to load recommendations.
Follow Us