ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

Updated on: Apr 03, 2026 | 7:30 PM

బయట ఎండలు మండిపోతున్నాయి.. కాస్త ఏసీ గాలి తగిలితే హాయిగా ఉంటుంది. కానీ ఆ చల్లని గాలి మిమ్మల్ని రోగులుగా మారుస్తోందని మీకు తెలుసా? గంటల తరబడి ఏసీలో కూర్చోవడం వల్ల కేవలం బరువు పెరగడమే కాదు, ప్రాణాంతకమైన ఊబకాయం ముప్పు కూడా పొంచి ఉందట. అసలు ఏసీకి, మన శరీర బరువుకు ఉన్న ఆ సంబంధం ఏంటో తెలుసుకుందాం..

1 / 5
భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క నిమిషం ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా ఉండలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆఫీసుల్లో 8 గంటలు ఏసీలో గడిపి, మళ్లీ ఇంటికి రాగానే ఏసీ ఆన్ చేసుకుంటున్నారా? అయితే మీరు తెలియకుండానే ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీకి, బరువు పెరగడానికి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

2 / 5
బరువు ఎందుకు పెరుగుతారు?: సాధారణంగా మన శరీరం తన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవడానికి నిరంతరం కేలరీలను ఖర్చు చేస్తుంది. కానీ మనం ఎప్పుడూ ఏసీ గదుల్లోనే ఉండటం వల్ల.. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మెటబాలిజం మందగించి.. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

3 / 5
ఆకలి పెరుగుతుంది: చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు శరీరానికి ఎక్కువ శక్తి కావాలనిపిస్తుంది. దీనివల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతాం. వేసవిలో బయట ఉంటే ఆకలి తక్కువగా ఉంటుంది. కానీ ఏసీ గదిలో కూర్చుంటే స్నాక్స్, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఈ ఎక్స్‌ట్రా క్యాలరీలు నేరుగా బరువు పెరగడానికి కారణమవుతాయి.

4 / 5
నిరంతర అలసట.. ఆక్సిజన్ కొరత: ఏసీ గదుల్లో గాలి బయటకు వెళ్లే మార్గం ఉండదు. అదే గాలి పదేపదే లోపలే తిరుగుతూ ఉండటం వల్ల ఆక్సిజన్ లభ్యత తగ్గి, కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల మెదడు, శరీరం త్వరగా అలసిపోతాయి. నిరంతర తలనొప్పి, గొంతు ఎండిపోవడం, తరచుగా జలుబు చేయడం వంటివి ఏసీ వల్ల కలిగే దుష్ప్రభావాలే.

5 / 5
ఏసీ వాడకం తప్పనిసరి అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని మరీ తక్కువలో కాకుండా 23 లేదా 24 డిగ్రీల వద్ద ఉంచడం సురక్షితం. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఏసీలో ఉన్నా కూడా పుష్కలంగా నీరు తాగాలి. ప్రతి గంటకు ఒకసారి ఏసీ గదిలో నుంచి బయటకు వచ్చి కాసేపు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Follow Us