బిందాస్‌ .. గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై.. నీటితో పనిచేసే సరికొత్త హైడ్రోజన్ స్టవ్ వచ్చేసింది! ధర ఫీచర్లు

Updated on: Apr 11, 2026 | 11:17 AM

దేశంలో చమురు, గ్యాస్ సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఒక భారతీయ స్టార్టప్ నీటితో పనిచేసే స్టవ్‌ను అభివృద్ధి చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ, ఇది నిజమేనండోయ్..పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు భారతీయ క్లీన్-టెక్ స్టార్టప్ గ్రీన్‌వైజ్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. నీటినే ఇంధనంగా మార్చి వంట చేసుకునే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్టవ్ ఎలక్ట్రోలిసిస్ (Electrolysis) ప్రక్రియ ద్వారా నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీస్తుంది. విడుదలైన హైడ్రోజన్ మంటగా మారి వంటకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎటువంటి హానికరమైన పొగ లేదా కార్బన్ విడుదల కాదు. పైగా, ఇది గాలిలోకి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది మీకు సంవత్సరాల తరబడి పడుతున్న ఎల్‌పిజి (LPG), పిఎన్‌జి (PNG) వంటి ఇబ్బందుల నుండి విముక్తిని కలిగిస్తుంది. పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..

1 / 6
పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు భారతీయ క్లీన్-టెక్ స్టార్టప్ గ్రీన్‌వైజ్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. నీటినే ఇంధనంగా మార్చి వంట చేసుకునే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్టవ్ ఎలక్ట్రోలిసిస్ (Electrolysis) ప్రక్రియ ద్వారా నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీస్తుంది. విడుదలైన హైడ్రోజన్ మంటగా మారి వంటకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎటువంటి హానికరమైన పొగ లేదా కార్బన్ విడుదల కాదు. పైగా, ఇది గాలిలోకి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

2 / 6
గ్రీన్‌వైజ్ సంస్థ ప్రవేశపెట్టిన ఈ హైడ్రోజన్ కుక్‌టాప్, నీటిని హైడ్రోజన్ ఇంధనంగా మార్చి వంటకు ఉపయోగిస్తుంది. ఇందులో ఎటువంటి గ్యాస్ సిలిండర్లు లేదా పైప్‌లైన్ల అవసరం లేదు. కేవలం 100 మి.లీ. డిస్టిల్డ్ వాటర్, 1 యూనిట్ (1 kWh) విద్యుత్తుతో సుమారు 6 గంటల పాటు నిరంతరంగా వంట చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా వంటగదిలోని గాలిని శుద్ధి చేస్తుంది.

3 / 6
ఈ స్టవ్‌ ముఖ్యమైన ఫీచర్లు తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఇది పనిచేస్తుంది. 100 మి.లీ. నీరు మరియు 1 యూనిట్ కరెంట్‌తో 6 గంటల వంట చేయవచ్చు. ఇది సాధారణ ఇండక్షన్ స్టవ్‌ల కంటే 90% తక్కువ విద్యుత్తును తీసుకుంటుంది.

4 / 6
దీనిని రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు అనుసంధానించవచ్చు. తద్వారా విద్యుత్ బిల్లు కూడా లేకుండా పూర్తిగా ఉచితంగా వంట చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇండక్షన్ కుక్కర్ల లాగా కాకుండా, దీనిపై ఇనుము, అల్యూమినియం, మట్టి పాత్రలు దేనినైనా ఉపయోగించవచ్చు.

5 / 6
ఈ టెక్నాలజీ కొత్తది కావడంతో ప్రస్తుతం ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సింగిల్ బర్నర్ స్టవ్ సుమారు రూ.1,05,000 + GST ఇందులో డబుల్ బర్నర్ స్టవ్ సుమారు రూ.1,50,000 + GSTతో మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టుగా సమాచారం.

6 / 6
ప్రస్తుతానికి దీని ధర ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య ఇళ్ల కంటే హోటళ్లు, కమ్యూనిటీ కిచెన్లు, క్యాంటీన్లకు ఇది ఎంతో లాభదాయకం. రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా వచ్చిన ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో వంట గ్యాస్ అవసరాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ఒక పెద్ద అడుగు.

Follow Us