వీటి ముందు తెల్ల ఇడ్లీ జుజుబీ.. రెండు తింటే బాడీ మొత్తం ఫుల్ ఎనర్జీ
Prasanna Yadla
10 November 2026
Pic credit - Pinterest
పాలక్ ఇడ్లీ తింటే ఒకటి కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే తెల్ల ఇడ్లీ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి
పాలక్ ఇడ్లీ
ఇడ్లీ పిండి 2 కప్పులు, ఒక కట్ట పాలకూర, 4 పచ్చి మిర్చి , అల్లం చిన్న ముక్క, జీలకర్ర – అర టీస్పూన్,
ఉప్పు తగినంత, నూనె – కొద్దిగా తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా మీరు పాలకూరను తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఆకులను మాత్రమే తీసుకోవాలి.
స్టెప్ 1
ఇక ఇప్పుడు ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని బాగా వేడి చేసి ఆ తరవాత పాలకూరను 2 నిమిషాలు ఉడికించాలి.
స్టెప్ 2
ఇంకా ఉడికించిన పాలకూరను తీసుకుని బాగా చల్లార్చి ఆ తరువాత ఆ నీళ్లు మొత్తాన్ని వంపేయాలి
స్టెప్ 3
ఇంకా పాలకూరలో 4 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ అల్లం వేసి దీనిని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ 4
ఇక ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకుని ఆ తరవాత పాలకూర పేస్ట్ ను కూడా దీనిలో కలపాలి
స్టెప్ 5
ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ రాసి రెడీ చేసుకోవాలి. ఇంకా ఇడ్లీ ప్లేట్లలో పాలక్ పిండిని వేసి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టాలి.
సన్నని మంటపై 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.