
షవర్ కర్టెన్లు : స్నానాల గదిలోని షవర్ కర్టెన్లు రోజూ నీటితో తడిసినప్పటికీ, వాటిపై మురికి, ఫంగస్, సబ్బు మరకలు పేరుకుపోతాయి. మీ షవర్ కర్టెన్ నైలాన్ లేదా కోటెడ్ ఫ్యాబ్రిక్‌తో తయారైనట్లయితే, దానిని నిరభ్యంతరంగా వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చు. వీటిని ఉతకడానికి ముందు కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ ఉపయోగిస్తే మురికి వదలడమే కాకుండా కర్టెన్లు తళతళలాడుతాయి.

బ్యాక్‌ప్యాక్‌లు: స్కూల్ పిల్లల బ్యాగుల నుండి ఆఫీసు బ్యాగుల వరకు దుమ్ము, చెమట వల్ల దుర్వాసన వస్తుంటాయి. వీటిని చేత్తో ఉతకడం చాలా కష్టం. కాబట్టి వీటని కూడా మనం వాషింగ్ మిషన్‌లో వేసి ఉతకొచ్చు. ఇందుకోసం ముందుగా బ్యాగ్‌ని ఖాళీ చేసి దుమ్మును పూర్తిగా దులపండి. తర్వాత బ్యాగ్‌ను ఒక లాండ్రీ బ్యాగ్‌లో ఉంచి, వాషింగ్ మిషన్‌ను జెంటిల్ మోడ్ లో ఉంచి తక్కువ డిటర్జెంట్‌తో ఉతికితే బ్యాగ్ కొత్తదానిలా మెరుస్తుంది.

పెంపుడు జంతువుల కాలర్లు : మనం పెంచుకునే కుక్కలు లేదా పిల్లుల మెడలో వేసే కాలర్లు త్వరగా మురికిగా మారి బ్యాక్టీరియాకు నిలయమవుతాయి. అయితే ఈ ఫ్యాబ్రిక్ కాలర్లను కూడా మనం వాషింగ్ మెషీన్‌లో సులభంగా శుభ్రం చేయవచ్చు. అయితే వీటిని ఉతికేప్పుడు మెటల్ బకిల్స్ మెషీన్‌కు తగలకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

తట్టు బ్యాగులు: ఈ మధ్య కాలంలో చాలా మంది పర్యావరణం కోసం తట్టు సంచులను వాడుతున్నారు. వీటిలోనే కూరగాయలు, నిత్యావసరాలు సరుకులను తీసుకొస్తున్నారు. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. కాబట్టి వీటిని లోపలి వైపునకు తిప్పి, తేలికపాటి డిటర్జెంట్‌తో మెషీన్‌లో వేస్తే క్రిములు నశిస్తాయి. అలాగే బ్యాగ్‌లు కూడా శుభ్రంగా మారుతాయి.

యోగా మ్యాట్‌లు: వ్యాయామం చేసేటప్పుడు వచ్చే చెమట వల్ల యోగా మ్యాట్‌లు త్వరగా మురికిగా మారుతాయి. మీ యోగా మ్యాట్ వాటర్-ఫ్రెండ్లీ మెటీరియల్ అయితే, దానిని చల్లటి నీటిలో జెంటిల్ సైకిల్‌లో ఉతకండి. అయితే ఉతికేప్పుడు కఠినమైన రసాయనాలు లేదా ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌లను వాడకండి, ఎందుకంటే ఇది మ్యాట్ గ్రిప్‌ను పాడు చేయవచ్చు. అయితే, ఏ వస్తువునైనా మెషీన్‌లో వేసే ముందు దానిపై ఉన్న వాష్ కేర్ లేబుల్ ను ఒకసారి తనిఖీ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. (Note : పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించి సమాచారం మేరకు అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడ లేదు)