Vizianagaram: తనిఖీల్లో భాగంగా బైక్ ఆపిన పోలీసులు.. చలానాలు చెక్ చేసి బిత్తరపోయారు..

|

Jul 29, 2023 | 12:40 PM

ఆంధ్రాలో ట్రాఫిక్ పోలీసులు అలెర్టయ్యారు. రూల్స్ ఎవరూ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పౌరులను కోరుతున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడేవారి బెండు తీస్తున్నారు. తాజాగా విజయనగరంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

1 / 5
 విజయనగరంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ బైక్ ఆపి.. వారంతా స్టన్ అయ్యారు. అందుకు కారణం ఆ వాహనంపై ఉన్న చలాన్లే. 5, 10 కాదండోయ్.. ఏకంగా ఆ బైక్‌పై  93 చలానాలు ఉన్నాయి. ఆ వాహనం నంబర్ 7099, గ్లామర్ బైక్  అని వెల్లడించారు.

2 / 5
తొలుత బైక్ ఆపగానే డ్రైవింగ్ లైసెన్స్ , సీ బుక్,  బైక్ ఇన్స్యూరెన్స్.. ఇలా అన్నీ చెక్ చేశారు. అలాగే బైక్‌పై ఉన్న ఫైన్స్ డేటా చెక్ చేయడంతో.., అసలు విషయం వెలుగుచూసింది. 

3 / 5
అయితే ఈ ఫైన్స్ అన్నీ.. ఆటోమేటిక్ ఈ చలాన్ సిస్టమ్ ద్వారా పడినమే అని ట్రాఫిక్ పోలీసుల వివరించాడు. అయితే తాను వేరు వ్యక్తి నుంచి బైక్ కొన్నట్లు ఆ బైక్ నడిపిన వ్యక్తి చెబుతున్నాడు. జరిమానాలు గురించి తనకు తెలియదు అంటున్నాడు. కానీ పోలీసులు ఆ చలానాలు కట్టాల్సిందే అని స్పష్టం చేశారు.

4 / 5
బైక్ అమ్మినా.. ఆ చలానాలు కట్టేందుకు పైసలు సరిపోవని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తామేం చేయలేమని.. రూల్స్ ఫాలో అవ్వాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. అతడు చలానాలు కట్టకపోవడంతో బండిని సీజ్ చేశారు.

5 / 5
ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలు  కొనుగోలు చేస్తుంటే అన్ని బైక్ డాక్యుమెంట్స్‌తో పాటు పెండింగ్ చలానాలు కూడా తనిఖీ చేయాలని చెబుతున్నారు.  వాటిని చూడకుండా వాహనం కొనుగోలు చేస్తే.. కొన్న వ్యక్తే ఆ చలానాలకు బాధ్యుడని చెబుతున్నారు. విజయనగరంలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్‌ ఈ చలనాలను చాలామందితో క్లియర్ చేయించారు. మొత్తం 163 మంది వాహనదారులు పాత ఈ చలానాలను చెల్లించినట్లు వివరించారు.