
సోషల్ మీడియాలో రోజూ ఏవో ఒక కొత్త కొత్త ట్రెండ్స్ వైరల్ అవుతూనే కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని యూజ్ అయినా కూడా మరి కొన్ని ప్రూఫ్స్ లేనివే. ఇక ఇప్పుడు కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

గర్భం కోసం చూసే వాళ్ళు ఏ చిన్నది కనిపించిన నమ్మి అవే ఫాలో అవుతున్నారు. ఇక మొన్నటికి మొన్న పచ్చి గుడ్డుతో తలస్నానం చేస్తే గర్భం వస్తుందని అనే ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.

తలకు గుడ్డును రాస్తే గర్భం ఎలా వస్తుంది? కొంచమైనా ఆలోచించండి. గర్భధారణ అనేది హార్మోన్ల సమతుల్యం మహిళా శరీర ఆరోగ్యంపై ఇది ఆధారపడి ఉంటుంది. దానికి, దీనికి కొంచం కూడా సంబంధం లేదు. ఈ మధ్య డిజిటల్ ట్రెండ్స్ జనాలను పక్కదారి పట్టిస్తున్నాయి.

ఇలాంటి ఆధారం లేని చిట్కాలను నమ్మి ఆరోగ్యం మీదకు తెచ్చుకోకండి. చదువుకోండి ఫస్ట్ చదువుకుంటే ఇవన్నీ అర్ధం అవుతాయి. వయసు పెరిగే కొద్దీ గర్భధారణ లేట్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి ట్రెండ్‌ను నమ్మకుండా, డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)