వందలో వంద మంది ఇష్టపడే అసలు సిసలైన పల్లెటూరి రోటి పచ్చడి ఇదే.. 5 నిముషాల్లోనే రెడీ

Updated on: Oct 22, 2026 | 3:25 PM

ఈ రెసిపీలో ఇంట్లో సులభంగా దొరికే పచ్చిమిర్చి, టమాటాలతో చేయవచ్చు. నోరూరించే రోటి పచ్చడిని వందలో వంద మంది ఇష్ట పడతారు. పల్లెటూరి పద్ధతిలో చేసే పచ్చడి దాని అసలైన రుచితో మీ భోజనాన్ని మరింత చక్కగా మార్చుకోవచ్చు. మీరు దీనిని 5 నిముషాల్లోనే ఈ పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసుకుని తినొచ్చు.

1 / 5

2 / 5
కావాల్సిన పదార్థాలు:  పచ్చిమిర్చి: 15 (మీ కారానికి తగ్గట్టుగా),  టమాటాలు: 300 గ్రాములు (ఎర్రగా పండినవి),  ఉల్లిపాయ: 1 (మీడియం సైజ్ ),  వెల్లుల్లి రెబ్బలు: కొన్ని (పొట్టు తీయకుండా), నూనె: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, అవసరమైనంత: చింతపండు లేదంటే చింతకాయ తొక్కు (కారం తగ్గించడానికి) తీసుకోవాలి.

3 / 5
ముందుగా, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టీస్పూను నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చిని వేసి బంగారు రంగు వచ్చేవరకు చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పూర్తిగా వేగి మెత్తబడాలి. వేయించిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి టమాటాలను మధ్యస్థ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు చేర్చి, మరో టీస్పూను నూనె కూడా వేయాలి. నూనె వేయడం వల్ల టమాటాలు అడుగంటకుండా చక్కగా మగ్గుతాయి. టమాటాలు మరీ మెత్తగా గుజ్జులా కాకుండా, కొద్దిగా ఆకారం పట్టుకుని మగ్గినట్లుగా చూసుకోవాలి. ఈ పద్ధతిలో మగ్గించడం వలన పచ్చడి కమ్మగా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు రోటి పచ్చడి తయారీలో ఇదే కీలకమైన దశ. ఇంకా రోలు ఉన్నవారు ముందుగా వేయించిన పచ్చిమిర్చిని రోట్లో వేసి, కొద్దిగా ఉప్పు చేర్చి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి మరీ మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా ఉండేలా చూసుకోవాలి. రోలు లేనివారు మిక్సీ జార్ లో వేసి, పల్స్ మోడ్ లో కచ్చాపచ్చాగా పట్టుకోవచ్చు. పచ్చిమిర్చి దంచిన తర్వాత, మగ్గించిన టమాటాలను రోట్లో వేసి, పచ్చిమిర్చి మిశ్రమంతో బాగా కలిసేలా దంచుకోవాలి. ఇప్పుడు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను, పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా రోట్లో వేయాలి. పల్లెటూరి పద్ధతిలో వెల్లుల్లి, ఉల్లిపాయలను పచ్చిగానే, పొట్టు తీయకుండా ఉపయోగిస్తారు. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోకుండా, అవి పచ్చడిలో తగులుతూ ఉండేలా దంచుకోవాలి.

5 / 5

పచ్చడిని రుచి చూసి, అవసరమైతే ఉప్పును చేర్చుకోవాలి. ఒకవేళ పచ్చడి కారం ఎక్కువగా అనిపిస్తే, కొద్దిగా చింతపండు లేదా చింతకాయ తొక్కును చేర్చుకోవడం వలన కారం తగ్గుతుంది.  అన్ని పదార్థాలు చక్కగా కలిసిపోయేలా దంచి, పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి వేడివేడి అన్నంతో, లేదా ఇడ్లీ, దోసె, చపాతీ వంటి వాటితో కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఇంట్లో తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే రుచికరమైన వంటకం.

Loading...
Unable to load recommendations.
Follow Us