
సామాన్యులకు షాక్ తగిలింది. కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరగడం, వేసవి కాలం క్రమంలో ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచేస్తున్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవల కిలో రూ.10కి లభించగా.. ఇప్పుడు రూ.20కిపైగా పలుకుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు బజార్‌లో కేజీ టమాటా రూ.23, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.40, బజ్జిమిర్చి రూ.21, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.11, బీన్స్ రూ.60, క్యారెట్ రూ.23, గోబిపువ్వు రూ.25, దొండకాయ రూ.23, చిక్కుడుకాయ రూ.50, గోరుచిక్కుడు రూ.28కి లభిస్తోంది.

ఇక కేజీ బీట్ రూట్ రూ.23, క్యాప్సికం రూ.33, ఆలుగడ్డ రూ.17, కీర రూ.18, దోసకాయ రూ.13, సొరకాయ రూ.15,. పొట్లకాయ రూ.18, కంద రూ.30, ఉల్లిపొరక రూ.40, ఉల్లిగడ్డ రూ.18, చామగడ్డ రూ.28, చిలకడదుంప రూ.25, పచ్చిబఠాణి రూ.40, బొప్పాయి రూ.40, పుట్టగొడుగులు రూ.45, ఎండుమిర్చి రూ.260 పలుకుతున్నాయి.

ఇక కిలో అల్లం రూ.100, వెల్లుల్లి రూ.200, చింతపండు రూ.160, పండుమిర్చి రూ.80, ఉసిరి రూ.100, కరివేపాకు రూ.80, పల్లికాయ రూ.50కి దొరుకుతున్నాయి. ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో కిలో టామాటా రూ.22, వంగ రూ.20, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.24, కాకర రూ.27, క్యారెట్ రూ.29, క్యాబేజీ రూ.18, బీర రూ.36, దొండ రూ.18, బంగాళదుంప రూ.19, ఉల్లి రూ.20, గోరుచిక్కుళ్లు రూ.24, దోస రూ.16, పొట్లకాయ రూ.28కి అమ్ముతున్నారు.

ఇక విజయాడలోని రైతు మార్కెట్లలో టమాటా రూ.28, వంగ రూ.26, బెండ రూ.20, పచ్చిమిర్చి రూ.25, కాకర రూ.26, క్యాబేజీ రూ.18, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.18, బంగళదుంప రూ.22, ఉల్లిపాయలు రూ.20, గోరుచిక్కడు రూ.22, దోస రూ.26, సొరకాయ రూ.11, చిక్కుళ్లు రూ.58, బీర రూ.34, చామదుంప రూ.30, బీన్స్ రూ.68 పలుకుతున్నాయి.