
కావాల్సిన పదార్థాలు: అరకిలో ఉసిరికాయలు, ఒక టేబుల్ స్పూన్ , రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ ఆవపిండి, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ పసుపు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు టేబుల్ స్పూన్స్ , పచ్చడి చేసాక దీనిని తాలింపు పెట్టుకోవాలి దీని కోసం పోపు గింజలు కూడా తీసుకోండి.

ముందుగా ఉసిరికాయలను తీసుకుని వాటిని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇంకా వాటి మీద ఉన్న నీరు మొత్తం పోయాక ఉసిరికాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసి గింజలను వేరు చేయాలి ఆ తరవాత వీటిని తీసుకుని మిక్సీ వేసి మరీ పేస్ట్ మాదిరి కాకుండా వాటిని కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఇలా చేస్తే తొక్కులా ఇంకా రుచిగా ఉంటుంది.

ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో ఈ ఉసిరి పేస్ట్ ను వేసి దానిలో కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవపిండి, ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి, ఇంకా పసుపు కూడా వేసి చేతితో మంచిగా కలపాలి. ఈ ఉసిరి తొక్కుకు కారం బాగా పట్టే వరకు ఉంచాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు ఉంచితే కారం ముక్కలకు పడుతుంది

చివర్లో పాన్ లో ఆయిల్ పోసి వేడయ్యాక ఆవాలు , జీలకర్ర, ముక్కలుగా చేసిన ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. మంచి వాసన వచ్చాక దీనిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా వేయించాలి. అయితే, ఈ వెల్లుల్లి మాడిపోకుండా చూసుకుంటూ కొంచం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి

పచ్చడి చేసిన తరవాత పొడిగా ఉన్న జాడీలో కానీ గాజు సీసాలో కానీ దీనిని చక్కగా నిల్వ చేసుకోవాలి. సీసాలో ఎలాంటి తడి లేకుండా పెట్టాలి లేదంటే ఈ తొక్కు త్వరగా పాడవుతుంది. ఇలా చేస్తే 15 రోజుల పాటు టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిని వేడి అన్నంలో వేసుకుని తింటే రుచిగా ఉంటుంది అల కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.