
బెండకాయ చాలా అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే కొన్ని సార్లు కర్రీ ఎంత టేస్టీగా అన్ని మసాలాలు వేసి వండినా, అంతగా రుచిని ఇవ్వదు. అయితే చాలా మంది దీనికి కారణం కర్రీలో ఏదో తక్కువ అయ్యింది అనుకుంటారు. కానీ కర్రీ అంతగా రుచిగా ఉండకపోవడానికి కారణం, బెండకాయలను కట్ చేసే విధానం అంట. కాగా, అసలు బెండకాయలు ఎలా కట్ చేయాలి? ఏ విధంగా కట్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుందో చూద్దాం.

ఇప్పటికీ చాలా మందికి బెండకాయలను కట్ చేసే విధానం సరిగ్గా తెలియదు. చాలా మంది బెండకాయలను అడ్డంగా కోస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా బెండకాయలను మీరు వండే వంట రకాన్ని బట్టి దానిని కట్ చేసి పెట్టుకోవాలంట. ఫ్రై చేసే సమయంలో బెండకాయలను చాలా తక్కువ పరిమాణంలో పొడవుగా కట్ చేసి, తర్వాత అడ్డంగా, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి.

ఇలా చేయడం వలన బెండకాయలను నూనెలో చాలా త్వరగా వేగుతాయి. అంతే కాకుండా వాటికి ఉండే జిగురు కూడా మొత్తం పోతుంది. అలాగే రుచి కూడా చాలా అద్భుతంగా వస్తుందంట. అదే విధంగా సూప్ చేసే సమయంలో బెండకాయలను రెండు కొనలు ముందుగా కట్ చేసి ,అడ్డంగా , గ్రుడ్రంగా అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి.

ఇలా కట్ చేయడం వలన సూప్ మరింత రుచికరంగా వస్తుంది. కానీ చాలా మంది అన్ని ముక్కలు ఒకే విధంగా కట్ చేయరు. దీని వల్లలనే కొన్నిసార్లు వంటకాల రుచి కూడా మారిపోతుందంట. అంతే కాకుండా బెండకాయలను కట్ చేసే విధానంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా బెండకాయలను ముందుగా నీటితో శుభ్రంగా కడిగి, ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తర్వాత వాటిని క్లాత్‌తో గట్టిగా తుడిచి, కాసేపు ఆరిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా వీటిని కట్ చేసిన తర్వాత శుభ్రం చేయకూడదంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.