Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో పొరపాటున కూడా ఈ ఆహారాలు తినకండి.. ఆరోగ్యం పాడవుతుంది.. జాగ్రత్త..

Updated on: Jul 12, 2023 | 4:42 AM

Unhealthy Breakfast: ప్రస్తుత కాలంలో పని బిజీలో పడి.. ఎవరూ ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపడం లేదు.. జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

1 / 5
Unhealthy Breakfast: ప్రస్తుత కాలంలో పని బిజీలో పడి.. ఎవరూ ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపడం లేదు.. జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అయితే, ఉదయం ఎంత బాగా ప్రారంభమైతే మీ రోజు అంత మెరుగ్గా ఉంటుంది. అంటే.. అల్పాహారం విషయంలో మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దంటున్నారు నిపుణులు.. అల్పాహారం ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేసేదే తీసుకోవాలి..

2 / 5
అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వును మాత్రమే తీసుకోవాలి. అయితే కొంత జాగ్రత్త కూడా అవసరం. అల్పాహారంలో ఏవి పడితే అవి తింటే.. ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. అవేంటో తెలుసుకోండి..

3 / 5
గత కొన్ని సంవత్సరాలుగా అల్పాహారం సమయంలో తృణధాన్యాలకు సంబంధించిన బ్రెడ్ లు తినే ధోరణి చాలా పెరిగింది. అయితే ఇవి ప్రాసెస్ చేసి తయారు చేయబడినందున ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందులో తృణధాన్యాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.. చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది మధుమేహం, ఊబకాయం, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

4 / 5
ఉదయం పూట పండ్లు, వాటి రసాలను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. అయితే కొందరు మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలను తీసుకుంటారు. ప్యాక్ చేసిన జ్యూస్‌లలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్‌లు, షుగర్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కావున ఈ అలవాటును మార్చుకోండి..

5 / 5
ఈ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్‌లో పెరుగుకు బదులుగా రుచిగల పెరుగులను తినే ట్రెండ్ చాలా పెరిగింది. అయితే ఈ ఫుడ్ ఐటమ్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే ఉదయం పూట దీనిని తినకూడదు.