
అందరి ఇళ్ళలో తులసి మొక్క ఉంటుంది. అయితే, కొన్ని సార్లు ఈ తులసి మొక్క ఎండిపోతుంది ఇలా జరగకుండా ఏడాదంతా పచ్చగా ఉండాలంటే ఇది ఒక గ్లాస్ పోస్తే చాలు తులసి గుబురుగా, పచ్చగా ఉంటుంది. ఇంకా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు

తులసి మొక్కకు మోతాదుకు మించి నీళ్లు పోయకూడదు. ఇంకా మట్టి మొత్తం ఆరిపోయిన తర్వాతే నీళ్లు పోయాలి.నీరు బాగా పోయడం వలన మొక్క ఎండిపోవడం, వాడిపోవడం జరుగుతుంది. మీరు దీనిని గమనిస్తూ మొక్క చుట్టూ తేమ ఉండేలా చూసుకోవాలి. దీనిని టైం ప్రకారం మీరు గుర్తు పెట్టుకోవాలి.

పచ్చి పాలు : ఈ పచ్చి పాలలో మీరు కొద్దిగా నీళ్లు కలిపి ఇంకా దీనిలో కొంచం పసుపు కూడా వేసి ఆ పాలను మొక్క మీరు చుట్టూ కొద్దీ కొద్దిగా చల్లాలి. ఇలా చేస్తే చిగుర్లు బాగా పెరిగి మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ టిప్ చాలా మందికి తెలియదు. మీరు మీ ఇంట్లో వీటిని పాటిస్తే పక్కా రిజల్ట్ తెలుస్తుంది.

ఈ తులసి మొక్కకి 8 గంటలు సూర్యరశ్మి అవసరం. ఇంకా ఈ మొక్కను ఎండ వచ్చే చోట మాత్రమే పెట్టాలి. దీనికి ఎండ తగలకపోతే ఈ మొక్క వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి

టీపోడి కూడా వేసుకోవచ్చు: ఈ మొక్క చుట్టూ ఉన్న మట్టిని చేత్తో గాని, వేరే వస్తువుతో గాని మంచిగా చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ టీపోడిని, 5 టేబుల్ స్పూన్స్ బియ్యపు నీళ్లు చుట్టూ చల్లడం వల్ల మొక్క బలంగా పెరగడమే కాకుండా చుట్టూ ఉన్న బ్యాక్టిరియాలు నశిస్తాయి.