
శరీరాన్ని చల్లబరచుకోవడానికి ఎంతో మంది మజ్జిగను గ్లాసుల మీద గ్లాసులు తాగుతుంటారు. అలాగే ఇది తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారని అనుకుంటూ ఉంటారు. మజ్జిగ ఎంతో మంచిది అయినప్పటికీ, ఒక్క దీని వలెనే అన్ని పోషకాలు అందవు. మీరు ఇది కూడా గుర్తు పెట్టుకుని దీనిని తాగాలి.

అయితే, మజ్జిగకు బదులు ఈ డ్రింక్ తాగితే యాక్టీవ్ గా ఉంటారు. దీనిని మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ పవర్ఫుల్ డ్రింక్ తాగితే శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, మినరల్స్ ఇలా అన్ని అందుతాయి. అంతేకాదు, మీ ఎముకలు బలంగా మారి రోజంతా మిమ్మల్ని యాక్టీవ్ గా ఉంచుతుంది. మరి లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం

ముందుగా మీరు గింజలు లేని ఖర్జూరం తీసుకోవాలి. ఇంకా ఈ నానపెట్టిన బాదం పై తొక్క మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో తొక్క తీసిన బాదం పప్పు, ఇంకా జీడిపప్పులు కూడా దీనిలో వేసి దానిలో కిస్ మిస్, గింజలు లేని ఖర్జూరం కూడా దీనిలో వేసి బాగా మిక్స్ పట్టుకోవాలి. ఇంకా ఈ పేస్టులో పెరుగు వేసి లస్సి లాగా చేసుకోవాలి.

ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. మీరు దీనిని రెడ్ కిస్ మిస్ లతో కూడా చేసుకోవచ్చు. ఈ లస్సీలో వాడేవి మీ ఇంట్లో ఉండేవి. ఇంకా దీనిలో కొద్దిగా బెల్లం ఇంకా పంచదార కూడా వేసుకోవాలి. అలాగే వారంలో మూడు సార్లు దీనిని తాగితే బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)