
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) అనేది వాహనాల్లో ఉండే సేఫ్టీ ఫీచర్. ఇది చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడమే కాదు.. సురక్షితమైన బ్రేకింగ్‌ను అనుమతిస్తుంది. మరి సేఫ్ డ్రైవింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSతో కూడిన బైక్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే చౌకైన 5 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

బజాజ్ పల్సర్ ఎన్160: బజాజ్ పల్సర్ ఎన్160 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. వివిధ కలర్ వేరియంట్లలో లభించే ఈ బైక్.. బ్రూక్లిన్ బ్లాక్ కలర్ మోడల్‌లో మాత్రమే డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్ అందుబాటులో ఉంది. అలాగే పూర్తి డిస్క్ బ్రేక్‌లతో మీరు ఈ స్పోర్ట్స్ బైక్ పొందొచ్చు.

బజాజ్ పల్సర్ NS160: బజాజ్ పల్సర్ NS160 బైక్ 160 CC సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ ఇంజిన్‌తో వస్తోంది. ట్రాన్స్‌మిషన్ కోసం, దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంది. ఈ మోడల్ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.35 లక్షలు.

TVS Apache RTR 200 4V మోడల్ బైక్‌కు డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్, రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ (RLP) కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్ అపాచీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.40 లక్షల నుంచి 1.45 లక్షల వరకు ఉంది.

బజాజ్ పల్సర్ NS200: బజాజ్ పల్సర్ మరొక మోడల్ NS200కి డ్యూయల్-ఛానల్ ABS సిస్టం అమర్చబడి ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.47 లక్షలు. ఈ బైక్ 199.5 CC సింగిల్-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ శక్తితో వస్తోంది. దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్25 అనేది డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో కూడిన డ్యాషింగ్ బైక్. దీని ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ 249 CC ఎయిర్ కూల్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ శక్తిని ఇస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది.