విపరీతంగా జుట్టు రాలుతోందా? డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు ఇవే!

Updated on: Sep 02, 2026 | 8:32 PM

సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు 50 నుండి 100 లేదా 150 వెంట్రుకలు రాలడం సహజమైన ప్రక్రియ. కానీ అంతకుమించి వారాల తరబడి విపరీతంగా జుట్టు రాలుతుంటే దానిని సాధారణ సమస్యగా భావించి ఇంట్లో దొరికే ఏవేవో DIY నూనెలు, ప్యాక్‌లు వాడి సమయాన్ని వృథా చేసుకోకూడదు. జుట్టు రాలడానికి కేవలం బాహ్య కారణాలే కాకుండా అంతర్గత ఆరోగ్య సమస్యలు కూడా ఎంతో కారణమవుతాయని ప్రముఖ డెర్మటాలజిస్ట్ మరియు ట్రైకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక రెడ్డి స్పష్టం చేశారు. జుట్టు రాలడానికి గల ప్రధాన 10 కారణాలు మరియు వాటి పరిష్కారాలు ఇప్పుడు చూద్దాం.

1 / 6
1. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా సర్జరీలు: టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు/చిన్నపాటి సర్జరీలు జరిగిన 2 నుండి 3 నెలల తర్వాత తీవ్రంగా జుట్టు రాలడం మొదలవుతుంది. దీనిని 'టెలోజెన్ ఎఫ్లూవియం' అంటారు. శరీరానికి ఒత్తిడి తగ్గిన తర్వాత సరైన చికిత్సతో ఇది క్రమంగా తగ్గుతుంది.

2 / 6
2. ఐరన్ మరియు ఫెర్రిటిన్ లోపం: ముఖ్యంగా భారతీయ మహిళల్లో శరీరంలో  ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత, నెలసరి సమస్యల వల్ల ఫెర్రిటిన్ తగ్గినప్పుడు హెయిర్ ఫాలికల్స్ బలహీనపడి జుట్టు రాలుతుంది.

3 / 6
3. విటమిన్-డి మరియు విటమిన్-బి12 లోపాలు: ఈ ముఖ్యమైన విటమిన్ల లోపం వల్ల వెంట్రుకల కుదుళ్లకు సరైన పోషణ అందక హెయిర్ ఫాల్ తీవ్రమవుతుంది. 4.  థైరాయిడ్ సమస్యలు: హైపో లేదా హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు ప్రారంభంలో అలసట, బరువు పెరగడం/తగ్గడం వంటి లక్షణాలతో పాటు జుట్టు వేగంగా రాలిపోతుంది.

4 / 6
5. పీసీఓఎస్ / పీసీఓడీ (PCOS): హార్మోన్ల అసమతుల్యత వల్ల తలమీద జుట్టు పలుచబడటం, అదే సమయంలో గడ్డం, ముఖంపై అవాంఛిత రోమాలు రావడం జరుగుతుంది. 6. ప్రసవానంతరం జుట్టు రాలడం: డెలివరీ అయిన 3 నుండి 8 నెలల కాలంలో హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది.

5 / 6
7. క్రాష్ డైట్స్ & వేగంగా బరువు తగ్గడం: సరైన న్యూట్రిషనిస్ట్ సలహా లేకుండా హఠాత్తుగా కఠినమైన డైటింగ్ చేయడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, మైక్రోన్యూట్రియెంట్లు అందక తీవ్రమైన హెయిర్ ఫాల్ వస్తుంది.  8,9 జన్యుపరమైన కారణాలు& ఒత్తిడి: కుటుంబంలో బట్టతల లేదా హెయిర్ థిన్నింగ్ చరిత్ర ఉండటం, తీవ్ర మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

6 / 6
10. రోజువారీ అనారోగ్యకర అలవాట్లు: నిద్రలేమి, జంక్ ఫుడ్ తినడం, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. జుట్టు రాలడం వారాల తరబడి కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే జుట్టు శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది!

Loading...
Unable to load recommendations.
Follow Us