శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి కీలక హెచ్చరిక.. తిరుమలలో కొత్త భద్రతా నిబంధనలు అమలు!

Edited By:

Updated on: Jul 11, 2026 | 10:53 AM

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనే నిర్ణయాలపై దృష్టి పెట్టింది. తిరుమల మాడ వీధులతో పాటు కొండంతా నిఘా పెట్టింది. భద్రతాపరంగా సమిష్టిగా పనిచేసేలా ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల భద్రత మరింత కట్టుదిట్టం కానుంది

1 / 5
తిరుమల భద్రత టీటీడీకే కాదు ప్రభుత్వానికి ప్రియారిటీ. అందుకే తిరుమల భద్రత పట్ల ఎప్పటి కప్పుడు సెక్యూరిటీ ఆడిట్ జరుగుతోంది. ఇప్పుడు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనే నిర్ణయాలపై దృష్టి పెట్టింది.  తిరుమల మాడ వీధులతో పాటు కొండంతా నిఘా పెట్టింది. భద్రతాపరంగా సమిష్టిగా పనిచేసేలా ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

2 / 5
ఈ నేపథ్యంలోనే తిరుమల భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. భక్తుడికే కాదు భద్రతకు కూడా పెద్ద పీట వేస్తున్నట్టు అధికార యంత్రాంగం  భద్రతపై ఫోకస్ చేసింది. తిరుమలలో అనుమానితులపై దృష్టి పెట్టింది. హాకర్లుగా దుకాణాలు, హోటళ్లు, నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న వారిలో అనుమానితులను గుర్తిస్తున్న పోలీసు యంత్రాంగం ఈ మేరకు నిరంతరం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. తిరుమలలో దాదాపు 1229 దాకా దుకాణాలు ఉండగా హాకర్ లైసెన్సుల సంఖ్య 588 ఉన్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి.

3 / 5
తిరుమలలో షాప్స్, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో బయట ప్రాంతాల నుండి వచ్చి పని చేస్తున్న వారి సంఖ్య  దాదాపు 3 వేల వరకు ఉంటుందని అంచనా. వీరెవరికీ తిరుమలలో ఉండేందుకు అనుమతి లేకపోగా తిరుపతి నుండి వచ్చి పని చేసి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే  తిరుమలలో భక్తుల మధ్య కలిసిపోయి చిరు వ్యాపారాలు చేస్తూ టీటీడీకి తెలియకుండా అనధికారికంగా జీవిస్తున్న వారి సంఖ్య  దాదాపు 1000 ఉంటోంది.

4 / 5
తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో భక్తుల ముసుగులో ఉంటూ తిరుమలలో అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరోవైపు తిరుమలలో జరిగే అభివృద్ధి పనులు, భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా  బయట ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. టీటీడీకి సంబంధం లేకుండా ఇలా తిరుమలకు వచ్చి ఓటు హక్కు కూడా పొందిన వారి సంఖ్య  దాదాపు 1000 వరకు ఉంటుందని తెలుస్తోంది. SIR లో ఇలాంటి కేసులు బయట పడుతుండగా తిరుమలలో విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్న పోలీసులు అనుమానితులను గుర్తించి కొండ దింపుతున్నారు.

5 / 5
 తిరుమల ఆలయం మాడవీధులతోపాటు పలు ప్రాంతాల్లో హాకర్ లైసెన్సులు లేకుండా అక్రమంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నారు. ఇక దుకాణాలు, హోటళ్లు, భవన నిర్మాణ పనుల్లో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్న పోలీసు యంత్రాంగం  సరైన ఆధారాలు చూపని వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇక అనుమానితులుగా భావించే వ్యక్తులను పనుల్లో పెట్టుకునే షాప్ యజమానులకు పోలీస్ యంత్రాంగం సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ప్రతి దుకాణం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి చేసింది. కొండంతా  కెమెరాలను ఏర్పాటుచేసి నిరంతర నిఘా కొనసాగేలా చర్యలు చేపట్టింది.

Follow Us