
కావాల్సిన పదార్థాలు : మటన్ కిలో, ఉల్లిపాయలు, 3, ఆవనూనె 200 గ్రామలు, ఆనియన్ తరగినవి కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండుటీ స్పూన్స్, పెరుగు రెండు టీ స్పూన్స్, బిర్యానీ ఆకు రెండు, దాల్చిన చక్కె చిన్న ముక్క, లవంగాలు 5, మిరియాలు వన్ టీ స్పూన్, నల్ల యాలకులు2, ధనియాల పొడి రెండు టీస్పూన్స్, కారం రెండు టీస్పూన్స్, పసుపు అరటీ స్పూన్, గరం మసాలా వన్ టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడ, కొత్తి మీర తరిగినది వన్ కప్పు, మెంతి నాలుగు నుంచి ఐదు రెబ్బలు, మట్టి కుండ మటన్ ఉడకడానికి సరిపడ సైజులో ఉన్నది.

తయారీ విధానం : ముందుగా ఆవనూనెను తీసుకొని, స్టవ్ ఆన్ చేసి, నూనె వేసి, నూనె మంచిగా మరిగే వరకు వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసిన మటన్ ముక్కల్లోకి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, పూదీనా, గరం మసాలా, యాలకులు, బిర్యానీ ఆకులు, పెరుగు, కారం, పసుపు, పైన చెప్పిన అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆవ నూనె అందులో వేస్తూ మొత్తం మ్యారినెట్ అయ్యే విధంగా కలిపి పక్క పెట్టుకోవాలి

తర్వాత కుండను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత , కుండలోపల కొంచెం నూనె రాయాలి. దీని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఇందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, చాలా తక్కువ స్లిమ్‌లో పెట్టుకొని స్టవ్ పై మటన్ ఉన్న కుండను పెట్టాలి. దానిపైన మూత పెట్టి, గాలి లోపలికి వెళ్లకుండా గోధుమ పిండితో కవర్ చేయాలి. ఇలా చేయడం వలన లోపల ఆవిరిలోనే మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది.

దాదాపు గంట సేపు కుండపైనే మటన్‌ను మెత్తగా ఉడికించాలి. కానీ ప్రతి పది నిమిషాలకు ఒకసారి మటన్‌ను కుదుపుతూ ఉండాలి. కుండను కదిలిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మటన్ మాడిపోకుండా ఉంటుంది.

గంట తర్వాత కుండపై ఉన్న మూతను తీసి చూస్తే వేడి వేడి గుమ గుమలాడే మట్టి కుండలో మటన్ కర్రీ రెడీ, ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. మూత తీసిన తర్వాత ఐదు నిమిషాలు స్టవ్ పై లో స్లిమ్‌లో ఉంచి, స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రోటీలోకి, వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే వావ్ అనాల్సిందే.