యూరిక్ యాసిడ్ తగ్గించే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం!

Updated on: Jan 26, 2026 | 9:37 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని హైప్ యూరిసెమియా అని కూడా అంటారు. దీని వలన కీళ్లు, మూత్రపిండ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని సార్లు ఇది చాలా ప్రమాదకరం కూడా కావచ్చు. అందుకే అధిక యూరిక్ యాసిడ్ సమస్య తగ్గిపోవాలి అంటే తప్పకుండా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు తినడం వలన యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ అవుతుందంట. కాగా, ఆ పండ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
సిట్రస్ ఫ్రూట్స్ : సిట్రస్ ఫ్రూట్స్ అంటే, నిమ్మకాయ, నారింజ వంటి పండ్లు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ మీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం వలన ఇవి మూత్ర పిండాల పనితీరును మెరుగు పరిచి, మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ విసర్జనను పెంచుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ డైట్‌లో నిమ్మకాయను చేర్చుకోవాలంట.

2 / 5
బెర్రీస్ : బెర్రీస్‌లలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పాలీఫెనాల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రతి రోజరూ వీటిని తినడం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి రోగిరోధక శక్తిని పెంచుతాయి. అయితే  అంతే కాకుండా ఇవి యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయంట. బెర్రీలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఇవి మూత్రపిండాల ద్వారా విషాన్ని బయటకు పంపి, శరీరానికి మేలు చేస్తాయి.

3 / 5
అరటి పండ్లు : అరటి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన రోజుకు ఒక అరటి పండు తినడం వలన ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను చాలా త్వరగా తగ్గిస్తుందంట. అంతేకాకుండా వాపులు, కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
పైనాపిల్ : పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉండటమే కాకుండా, సహజ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అందువలన దీనిని తీసుకోవడం వలన ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించి, మూత్రపిండాల ఆరోగ్యానికి దోహద పడుతుంది.

5 / 5
చెర్రీస్ : చూస్తే చిన్నగా కనిపించే ఈ చెర్రీస్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉండటం వలన ఇది వాపు సమస్యలను తగ్గించి, అధిక యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేస్తుంది. అందుకే ఎవరు అయితే అధిక యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నారో, వారు వీటిని డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది.