పక్కా తెలంగాణ పద్ధతిలో..యూట కూరలోకి బగారా రైస్ ఎలా వండాలో తెలుసా?

Updated on: May 13, 2026 | 5:35 PM

తెలంగాణ రుచుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే యాట కూర, బగారా రైస్ ఉండాల్సిందే. చాలా మంది ఈ కాంబినేషన్ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ స్టైల్ బగారా రైస్ టేస్ట్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కాగా, దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : యాలకులు, లవంగాలు, షాజీరా, రాతి పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, నల్లయాలకులు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్, ఉప్పు, నీళ్లు కొత్తిమీర, పెరుగు, పూదీన, షాజీర.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా రెండు గ్లాస్‌ల బియ్యం తీసుకోవాలి. వీటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిలో నీళ్లు పోసి ఐదు పదినిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే బగార రైస్ తయారీ కోసం ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ చిన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా, కొత్తిమీర, పూదీన వంటి వాటిని చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి, నెయ్యి, నూనె సరిపడ వేసుకోవాలి. ఇది బాగా వేడి అయిన తర్వాత  అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చీ, కొంచెం కొత్తిమీర, పూదీన, వేసి బాగా కలిపి దోరగా వేయించుకోవాలి.

4 / 5
ఇవి కాస్త వేగిన తర్వాత బగారా ఆకు, షాజీరా, రాతి పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు కొంచెం పొడిలా చేసి వేయాలి. అలాగే యాలకులు వేసి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి.  మీకు వీలైతే క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి.

5 / 5
నీళ్లు బాగా మరుగుతాయి. నీళ్లు మరిగి పొంగులా వచ్చే సమయంలో అందులోనే ఉప్పు, నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అలాగే రెండు లేదా ఒక చెంచా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి అన్నం మంచిగా ఉడికేలా చూసుకోవాలి. అంత అన్నం మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. దీంతో వేడి వేడి బగారా రైస్ రెడీ.  మటన్ కర్రీ, ముఖ్యంగా యాట కూరతో పాటు ఈ రైస్ తింటే టేస్ట్ అదిరిపోతుంది.

Follow Us