Narender Vaitla |
Oct 02, 2022 | 9:29 PM
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ నోట్ సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్‌మీ నోట్ 12ను ఈ ఏడాది చివరి నాటికి చైనాలో లాంచ్ చేయనుంది. దీంతో ఈ ఫోన్ వచ్చే ఏడాది భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం లీక్ అయిన సమాచారం మేరకు ఈ ఫోన్‌లో 210 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం. రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక ఈ ఫోన్‌లలో 6.6 ఇంచెస్ ఫుడ్ హెచ్‌డీ + ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా అందించనున్నట్లు తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని సమాచారం.
ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌తో, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో రానున్న ఈ ఫోన్ ధర రూ. 16,990గా ఉండొచ్చని అంచనా.