
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 11టీ ప్రో పేరుతో ఈ ఫోన్‌ను జనవరి 19న లాంచ్ చేయనున్నారు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కి ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన అమోఎల్ఈడీఈ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ను 8GB + 128GB, 8GB + 256GB , 12GB + 256GB వేరియంట్లలో రానుంది.

ఇక ఛార్జింగ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 120 వాట్స్ హైపర్ ఛార్జ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ ఫోన్ బ్యాటరీ కేవలం 17 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

రూ. 40,000 ప్రారంభ ధరతో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్న ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు.