Whatsapp: డీప్‌ఫేక్‌ వీడియోలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఎలా పని చేస్తుందంటే..

|

Feb 20, 2024 | 12:23 PM

డీప్‌ఫేక్‌ వీడియోలు ఎలాంటి అలజడి సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దీంతో సెలబ్రిటీలు హడలెత్తిపోతున్నారు. అవసరాలకు ఉపయోగించుకోవాల్సి టెక్నాలజీ పక్కదారి పడితే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. దీంతో ఇలాంటి డీప్‌ఫేక్‌లనకు అడ్డుకట్ట వేయడానికి కంపెనీలు నడుం బిగిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా వాట్సాప్‌ ముందడుగు వేసింది..

1 / 5
 ప్రపంచాన్ని మారుస్తోన్న ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్‌, భయాందోళనకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు అందరినీ అలజడికి గురి చేస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా బాధితులుగా మారుతోన్న పరిస్థితి ఉంది.

2 / 5
మొన్నటి మొన్న అమెరికా అధ్యక్షుడి ఫేక్‌ వీడియోను రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అమెరికా ప్రభుత్వం ఇలాంటి వీడియోలపై ఉక్కుపాదం మోపింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌ సైతం డీప్‌ ఫేక్‌ వీడియోలకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

3 / 5
ఇందులో భాగంగానే ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించింది. ఫ్యాక్ట్-చెకింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించేందుకు మిస్-ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్(ఎంసీఏ), మెటా సంయుక్తంగా పనిచేయనున్నట్టు ఇరు సంస్థలు సోమవారం ప్రకటనలో వెల్లడించాయి.

4 / 5
ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌ డిజైన్‌ చేశారు. దీనికి డీప్‌ఫేక్, నకిలీ సమాచారాన్ని పంపడం ద్వారా వాటిని కట్టడి చేసే వీలుంటుందని చెబుతున్నారు. వచ్చే నెలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ చాట్‌బాట్ ఇంగ్లీష్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

5 / 5
నకిలీ సమాచారం వైరల్‌ అవుతోన్న తరుణంలో దీనికి అడ్డుకట్ట వేయడానికి మొత్తం టెక్ పరిశ్రమ నుంచి సహకారం అవసరమని మెటా పబ్లిక్ పాలసీ ఇండియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డీప్‌ఫేక్ ద్వారా జరిగే మోసాలను నిలువరించేందుకు ఎంసీఏ సహకారంతో వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.