
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో చైనా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వివో ఎక్స్ 100 సిరీస్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి.

వచ్చే వారంలో తొలుత చైనా మార్కెట్లోకి లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు తీసుకొస్తారన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే చైనాలో ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభం అయ్యాయి. వీటిలో 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ వేరియంట్స్‌తో తీసుకురానున్నారు.

మే 13వ తేదీన ఈ ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకనట చేయలేదు. అయితే నెట్టింట కొన్ని ఫీచర్లు, ఆప్షన్స్ లీక్ అయ్యాయి. వాటి ప్రకారం ఈ ఫోన్ ధర ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం.

వివో ఎక్స్100 అల్ట్రా, ఎక్స్100ఎస్ ప్రో ఫోన్లను స్పేస్ గ్రే, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్స్‌లో జీస్ బ్రాండెడ్ కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. తొలి సేల్ మే 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఇక ధర విషయానికొస్తే వివో ఎక్స్100 అల్ట్రా ధర మన కరెన్సీలో రూ. 77,500కాగా, వివో ఎక్స్100ఎస్ ధర సుమారు రూ.46,200, వివో ఎక్స్100ఎస్ ప్రో రూ.57,000 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.