
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి త్వరలోనే తన ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు

ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. వివో ఎక్స్ ఫోల్డ్ 3ని సన్నగా డిజైన్ చేయనున్నారు. ఇప్పటికే చైనాలో వివో ఎక్స్ ఫోల్డ్ 3, ఎక్స్ ఫోల్డ్ 3 ప్రొ లాంచ్ చేశారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ షాట్స్ కోసం మరో 50 ఎంపీ కెమెరా, పోర్ట్రయిట్ షాట్స్ కోసం 50 ఎంపీ కెమెరాను అందించారు.

ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లోనూ ఒకే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ను ఫోల్డ్ చేసినప్పుడు 4.65 ఎంఎంతో ఉండనుంది. ఇందులో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించనున్నారు.

బ్యాటరీ విషయానికొస్తే ఎక్స్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే ఫోల్డ్ 3 ప్రొ 100 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5700 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.