Vivo Y200i: రూ. 20వేలలోనే అదిరిపోయే ఫీచర్లు.. వివో నుంచి స్టన్నింగ్ ఫోన్‌

|

Apr 21, 2024 | 7:41 AM

స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై200ఐ పేరుతో చైనా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో చైనా మార్కెట్లోకి శనివారం కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై200ఐ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి లుక్‌, అదిరే ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు.

2 / 5
వివో వై200ఐ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర మన కరెన్సీలో రూ. 18,800గా ఉండనుంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,200గా ఉండనుంది. ఇక 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,500గా ఉండనుంది.

3 / 5
ఫీచర్ల విషయానికొస్తే వివో వై200ఐ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 5 జెన్‌ 2 చిప్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వైపీ64 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ ఆప్షన్‌ను అందించారు. ఏప్రిల్‌ 27 నుంచి చైనాలో సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. అయితే భారత మార్కెట్లోకి ఈఫోన్‌ ఎప్పుడు రానుందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

5 / 5
ఇక కెమెరా విషయానికొస్తే వివోవై200ఐ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.