Youtube: యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది.. ఇకపై కామెంట్లను మీకు నచ్చిన భాషలో చదవొచ్చు..

|

Sep 16, 2021 | 7:51 PM

Youtube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్‌ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. వీడియోల కింద వచ్చే కామెంట్లను మనకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్‌ చేసుకునే అవకాశం కల్పించేలా 'ట్రాన్స్‌లేట్‌' అనే ఫీచర్‌ను..

1 / 6
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వీడియో స్ట్రీమింగ్‌ సేవల్లో యూట్యూబ్‌ ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే యూట్యూబ్‌ అంత క్రేజ్‌ సంపాదించుకుంది.

2 / 6
ఈ క్రమంలోనే యూట్యూబ్‌ తాజాగా 'ట్రాన్స్‌లేట్‌' అనే ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్‌ యూజర్లను అందించనున్నారు.

3 / 6
సహజంగా యూట్యూబ్‌లో వీడియోలు ప్లే అవుతోన్న సమయంలో కింద కామెంట్లు వస్తాయన్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌ తీసుకొస్తున్న 'ట్రాన్స్‌లేట్' ఫీచర్‌తో ఈ కామెంట్లను మీకు నచ్చిన భాషల్లోకి తర్జుమా చేసుకొని చదవొచ్చు.

4 / 6
 సుమారు వందకు పైగా భాషల్లోకి కామెంట్లను ట్రాన్స్‌లేట్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

5 / 6
 లైక్, డిస్లైక్, రిప్లై ఆప్షన్స్ కింద ట్రాన్స్‌లేట్ బటన్‌ను ఇవ్వనున్నారు. దీనిని క్లిక్‌ చేయగానే కామెంట్లు మీకు నచ్చిన భాషలోకి మారిపోతుంది.

6 / 6
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు యూట్యూబ్ ఇటీవల 'వీడియో సబ్ టైటిల్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్'‌ ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.