Car Number Plates: ఎరుపు రంగు కారు నంబర్ ప్లేట్ ఎవరు వినియోగిస్తారో తెలుసా? మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు

|

Aug 21, 2024 | 1:29 PM

కారు ఉంటే దానికి నంబర్ ప్లేట్ తప్పక ఉంటుంది. 'మోటార్ వెహికల్ యాక్ట్ 1988' ప్రకారం ప్రతి వాహనం నంబర్ ప్లేట్‌పై స్థానిక RTO కార్యాలయం జారీ చేసిన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. కానీ ఈ నంబర్ ప్లేట్లన్ని ఒకే రంగులో కాకుండా విభిన్న రంగులతో ఉంటాయి. ఒకటి నలుపు, మరొకటి పసుపు. అధికంగా కారులకు తెలుపు లేదా పసుపు రంగు ప్లేట్లు వాడతారని చాలా మందికి తెలుసు. అయితే మిగిలిన రంగుల అర్థం..

1 / 9
కారు ఉంటే దానికి నంబర్ ప్లేట్ తప్పక ఉంటుంది. 'మోటార్ వెహికల్ యాక్ట్ 1988' ప్రకారం ప్రతి వాహనం నంబర్ ప్లేట్‌పై స్థానిక RTO కార్యాలయం జారీ చేసిన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. కానీ ఈ నంబర్ ప్లేట్లన్ని ఒకే రంగులో కాకుండా విభిన్న రంగులతో ఉంటాయి. ఒకటి నలుపు, మరొకటి పసుపు. అధికంగా కారులకు తెలుపు లేదా పసుపు రంగు ప్లేట్లు వాడతారని చాలా మందికి తెలుసు. అయితే మిగిలిన రంగుల అర్థం ఏమిటో తెలుసా?

2 / 9
బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్..  ఈ రకమైన బ్లాక్ కలర్ బోర్డ్‌లో వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ పసుపు రంగులో ఉంటుంది. నలుపురంగు నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వ్యాపారం కోసం ఉపయోగిస్తారు. వీరు అద్దె కారును కొనుగోలు చేస్తే, అది నల్ల నంబర్ ప్లేట్‌తో వస్తుంది. ఈ ప్లేట్ సాధారణంగా లగ్జరీ హోటళ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే బ్లాక్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాన్ని నడపడానికి డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు.

3 / 9
బ్లూ నంబర్ ప్లేట్లు.. విదేశీ దౌత్యవేత్తలను రవాణా చేయడానికి నీలం నంబర్ ప్లేట్‌లతో కూడిన వాహనాలు ఉపయోగిస్తారు. వాటిపై వివిధ రకాల కోడ్‌లు ఉంటాయి. ఈ కోడ్‌లు.. ఐక్యరాజ్యసమితి కోసం 'UN', కాన్సులర్ కార్ప్స్ కోసం 'CC', డిప్లొమాటిక్ కార్ప్స్ కోసం 'DC' అని ఉంటాయి.

4 / 9
రెడ్ నంబర్ ప్లేట్.. RTO కార్యాలయం నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేంత వరకు మన దేశంలో జారీ చేసే తాత్కాలిక నంబర్ ప్లేటు ఇది. ఆ సంఖ్య సాధారణంగా రెడ్ కలర్ నంబర్ ప్లేట్ బోర్డుపై ఇస్తారు. కానీ ఇలాంటి తాత్కాలిక నంబర్లకు ఒక నెల మాత్రమే చెల్లుబాటు ఉంటుంది. అయితే ప్రతి రాష్ట్రానికి తాత్కాలిక నమోదుకు సంబంధించి దాని స్వంత నియమాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఎరుపు నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను రోడ్డుపైకి అనుమతించరు.

5 / 9
గ్రీన్ నంబర్ ప్లేట్.. ఈ నంబర్ ప్లేట్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఈ-రిక్షాలు, బస్సులకు ఈ రంగు నంబర్ ప్లేట్‌లతో ఉంటాయి. దానిపై తెల్ల అక్షరాలతో కారు నంబర్ రాసి ఉంటుంది.

6 / 9
పసుపు నంబర్ ప్లేట్.. ఈ నంబర్ ప్లేట్ అందరికీ సుపరిచితమే. ఈ రంగు నంబర్‌ ప్లేట్లు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే వాహనాలపై ఉంటాయి. టాక్సీలు, ప్రైవేట్ క్యాబ్‌లు, ట్రక్కులు, బస్సులలో పసుపు రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి.  కమర్షియల్ పర్మిట్ కలిగిన వాహనాలకు పసుపు రంగులో నంబర్‌ ప్లేట్‌ ఉంటుంది.

7 / 9
వైట్ కలర్ నంబర్ ప్లేట్.. ఈ నంబర్ ప్లేట్ మనదేశంలో సర్వసాధారణం. వీటిపై నల్ల అక్షరాలతో వాహనం నంబర్ రాసి ఉంది. ఇటువంటి వాహనాలను వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. సాధారణంగా కారు కొనుగోలు చేసిన వారందరికీ ఈ బోర్డు వస్తుంది.

8 / 9
పైకి బాణం ఉన్న నంబర్ ప్లేట్లు.. పైకి బాణం ఉన్న నంబర్ ప్లేట్లు రక్షణ సిబ్బంది, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినవి. వీటితో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ప్రత్యేక నంబర్ ప్లేట్‌ని ఉపయోగించడానికి అనుమతిస్తారు.

9 / 9
అశోక స్థంభం ఉన్న రెడ్ నంబర్ ప్లేట్లు.. ఈ రకమైన నంబర్ ప్లేట్‌లను సామాన్య ప్రజలు, మంత్రులు, అధికారులు ఉపయోగించడానికి వీలులేదు. భారత రాష్ట్రపతి,ప్రతి రాష్ట్ర గవర్నర్ కార్లకు మాత్రమే ఎరుపు రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి. తమ వాహనాలపై భారతీయ చిహ్నం అశోక స్తంభాన్ని ప్రదర్శించడం దీని ప్రత్యేకత.