
ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్‌తో వచ్చే మొదటి ఎంపికలలో ఒకటిగా ఉంటుంది. ఈ ఏసీ బయట ఉష్ణోగ్రత ఆధారంగా శక్తిని స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. 6 ఇన్ 1 కన్వర్టిబుల్ మోడ్‌తో అమర్చి వచ్చే ఈ ఏసీ 100 శాతం కాపర్ ట్యూబ్‌లను ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. ఇది మీ ఏసీ ని దీర్ఘకాలంలో తుప్పు పట్టకుండా రక్షణనిస్తుంది. స్టెబిలైజర్ ఫ్రీ ఫీచర్‌తో వచ్చే ఈ స్ల్పిట్ ఏసీ ధర రూ. 46,590గా ఉంది.

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ ఉపకరణాన్ని సులభంగా నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వారికి వాయిస్ కమాండ్‌లను కూడా ఇవ్వవచ్చు. అలెక్సా లేదా హే గూగుల్ ద్వారా మీ పనిని హ్యాండ్స్-ఫ్రీగా చేసుకోవచ్చు. నిజమైన ఏఐ మోడ్ గది ఉష్ణోగ్రతను తెలివిగా గుర్తిస్తుంది. కాపర్ కండెన్సర్ కాయిల్స్‌తో రావడం వల్ల అత్యుత్తమ శీతలీకరణను అందిస్తాయి. మీ ఏసీను దీర్ఘకాలంలో తుప్పు నుంచి దూరంగా ఉంచుతుంది. ఈ స్ప్లిట్ ఏసీ ధర రూ. 44,990గా ఉంది.

డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. పీఎం 2.5 ఫిల్టర్‌తో వచ్చే ఈ ఏసీ ధూళి లేని గాలిని మాత్రమే అందిస్తుంది. అంతర్నిర్మిత స్టెబిలైజర్ వోల్టేజ్ హెచ్చుతగ్గులను నిర్వహిస్తుంది. ఏసీలో ఏదైనా ఇబ్బంది ఉంటే రిమోట్ స్క్రీన్‌పై సంబంధిత కోడ్‌ను చూపడం ఈ ఏసీ ప్రత్యేకత. ఈ స్ప్లిట్ ఏసీ ధర రూ. 45,490గా ఉంది.

వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్, స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ సర్దుబాటు చేసేలా 4 కూలింగ్ మోడ్‌లతో వస్తుంది. ఏసీ 52 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల తట్టుకునేలా కాపర్ కాయిల్ కండెన్సర్‌తో శక్తిని పొందుతుంది. యాంటీ-డస్ట్ ఫిల్టర్ గాలి నుంచి అన్ని ధూళి, దుమ్ము, అలెర్జీ కారకాలను తొలగిస్తుంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌తో ఇవి హీట్ లోడ్‌పై ఆధారపడి శక్తిని సర్దుబాటు చేస్తాయి. ఈ స్ప్లిట్ ఏసీ ధర రూ. 37,990గా ఉంది.

లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అధిక శక్తి సామర్థ్యంతో కూడిన పవర్-ప్యాక్డ్ పనితీరుకు సంబంధించిన కచ్చితమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. 5 ఇన్ 1 కన్వర్టిబుల్ మోడ్‌తో మీ అవసరాలకు అత్యంత సరిపోయేదాన్ని సులభంగా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో వచ్చే కాపర్ ట్యూబ్‌లు మీ స్ప్లిట్ ఏసీని తుప్పు పట్టకుండా నిరోధిస్తాయి. అందువల్ల దీర్ఘకాలంలో వాటి మన్నికను పెంచడంతోపాటు అత్యుత్తమ శీతలీకరణను అందిస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ ధర రూ. 39,990గా ఉంది.