Smart watches: ఇవి వాచ్ లు కాదు..చిన్నసైజు ఫోన్లే..అదిరే ఫీచర్లు వీటి సొంతం

Updated on: May 14, 2025 | 3:57 PM

ఆధునిక కాలంలో స్మార్ట్ వాచ్ అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైన వస్తువుగా మారింది. సమయం చూసుకోవడంతో పాటు చిన్న సైజు స్మార్ట్ ఫోన్ మాదిరిగా సేవలు అందిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, పెద్దలు .. ఇలా అన్ని వయసుల వారికీ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ, ఫిట్ నెస్ ట్రాకర్, మెసేజ్ లు చూసుకోవడం, కాల్స్ చేసుకోవడం, ఇ-మెయిల్స్ కు బదులివ్వడం తదితర అన్ని పనులను చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్లతో అమెజాన్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్ లు, వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5
అమేజ్ ఫిట్ యాక్టివ్ 2 స్మార్ట్ వాచ్ అనేక ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. వాయిస్ కమాండ్ ద్వారా సందేశాన్నిటైపు చేసుకోవచ్చు. స్టెయిన్ లెస్ స్టీల్ బిల్ట్ డిజైన్, అమోలెడ్ డిస్ ప్లే, హైరోక్స్ రేస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రన్నింగ్, పాడెల్, యోగా తదితర 160కి పైగా స్పోర్ట్ మోడ్ లు, 50 మీటర్ల నీటి నిరోధకత, 10 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఇ-మెయిల్, మెసేజ్ లకు దీనిలోనే చక్కగా చదువుకోవచ్చు. కచ్చితమైన దారిని చూపేందుకు జీపీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వాచ్ రూ.9,999 ధరకు అమెజాన్ లో అందుబాటులో ఉంది.

2 / 5
ఆధునిక ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్ వాచ్ కోరుకునేవారికి ఆపిల్ వాచ్ అల్ట్రా 2 అత్యుత్తమ ఎంపిక. మంచి డిజైన్, హైఎండ్ ఫీచర్లతో ఈ వాచ్ ఎంతో ఆకట్టుకుంటోంది. క్రీడాాకారులకు, అడ్వెంచర్లు చేసే వారికి బాగా నప్పుతుంది. అన్ని నోటిఫికేషన్లు స్పష్టంగా చూపించే పెద్ద రెటినా డిస్ ప్లే, కచ్చితమైన నావిగేషన్ కోసం డ్యూయల్ ఫ్రీక్వెన్సీ, 36 గంటలు పనిచేస్తే బ్యాటరీ అదనపు ప్రత్యేకతలు. ఆరోగ్య సంరక్షణతో పాటు ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అమెజాన్ లో ఈ వాచ్ ను రూ.89,900కు కొనుగోలు చేయవచ్చు.

3 / 5
ఆఫీసులకు వెళ్లే మగవారికి ఫాసిల్ జెన్ 6 వాచ్ చాలా బాగుంటుంది. స్లైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో దీన్ని రూపొందించారు. ఫిట్ నెస్, చెల్లింపులు, మ్యూజిక్, వార్తలు, గేమ్ లు, స్టాప్ వాచ్ తదితర యాప్ లు ఆకట్టుకుంటున్నాయి. అరగంటలోనే బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. 3 ఏటీఎం డిజైన్, ఆరోగ్య ట్రాకింగ్, నిద్ర, గుండె స్పందన రేటు, రక్త ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. జీపీఎస్ ట్రాకర్ తో దారులను సులభంగా నావిగేట్ చేసుకునే వీలుంది. అమెజాన్ లో రూ.11,247కి ఈ వాచ్ అందుబాటులో ఉంది.

4 / 5
విద్యార్థులు, నిపుణులు, ఫిట్ నెస్ ప్రియుల కోసం గార్నిన్ ఫోర్రన్నర్ స్మార్ట్ వాచ్ తీసుకువచ్చారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ అన్ని రకాల పనులకు ఉపయోగపడుతుంది. అంతర్నిర్మిత జీపీఎస్, బటన్ నియంత్రణ కలిగిన అమోలెడ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 11 రోజుల బ్యాటరీ బ్యాకప్ బాగున్నాయి. ముఖ్యంగా అథ్లెటిక్స్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. కచ్చితమైన జీపీఎస్ తో నావిగేషన్ చాలా సులభంగా ఉంటుంది. అమెజాన్ లో ఈ వాచ్ ను రూ.26,990కి కొనుగోలు చేయవచ్చు.

5 / 5
టైటాన్ క్రెస్ట్ స్మార్ట్ వాచ్ ను విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఎప్పుడూ ఆన్ లో ఉండే 1.43 అంగుళాల డిస్ ప్లేతో నోటిఫికేషన్లను చక్కగా చూసుకోవచ్చు. లేటెస్ట్ చిప్ సెట్, బ్లూటూత్ కాలింగ్, కాంటాక్టులను సేవ్ చేసుకోవడం, ఒత్తిడి, నిద్ర స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అంతర్నిర్మిత గేమ్ ఫీచర్, వందకు పైగా వాచ్ ఫేస్ లు, బహుళ స్పోర్ట్స్ మోడ్ లు అదనపు ప్రత్యేకత. అత్యవసర సమయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తక్షణమే కాల్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ను అమెజాన్ లో కేవలం రూ.5,999కి కొనుగోలు చేయవచ్చు.