భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను పోకో ఎఫ్ 5 5జీ ఫోన్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 8 జీబీ +256 జీబీ, 12 జీబీ +256 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర వరుసగా రూ.23,999 నుంచి రూ.26,999 వరకూ ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ బరువు కేవలం 180 గ్రాములే. స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దుతునిచ్చేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు.
వన్ ప్లస్ 10 ఆర్ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ.27,999కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.
రియల్‌మీ 11 ప్రో ప్లస్ ఫోన్ కేవలం రూ.25,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో ఉండే 200 ఎంపీ ప్రైమరీ కెమెరా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. వీటితో పాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాతో పాటు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. అలాగే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 750 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్‌లో 100 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
టెక్నో క్యామాన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ అధునాతన ఫీచర్లతో వస్తుంది. బడ్జెట్‌లో టెక్నో కెమాన్ 20 ప్రీమియం లుక్‌తో వస్తుంది. ఈ ఫోన్ రూ.28,999కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. సెన్సార్-షిఫ్ట్ ఓఐఎస్ సపోర్ట్ చేసేలా 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పని చేసే ఈ ఫోన్ ఆటో-ఫోకస్‌తో 108 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాతో వస్తుంది. ముఖ్యంగా సెల్ఫీ ప్రియుల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8050 చిప్ సెట్‌తో పని చేస్తుంది. అలాగే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్ 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ రూ.26,999కు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫోన్ కోరుకునే ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. 8 జీబీ +256 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్ 6.55 అంగుళాల పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 8020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్ 68 వాట్స్ ఫాస్ట్‌చార్జింగ్‌కు మద్దతునిచ్చేలా 4400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.