Laptops Under 40K: టాప్ ల్యాప్‌టాప్‌లు.. బెస్ట్ ఫీచర్లు.. అతి తక్కువ ధరలో..

|

Apr 12, 2024 | 7:04 AM

కొత్త ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలంటే అనేక అంశాలను పరిశీలించాలి. మన పనికి అనుకూలంగా ఉండే ఫీచర్లతో పాటు దాని పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, ఇతర ప్రత్యేకతలను తెలుసుకోవాలి. అలాగే ధర కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో, అలాగే ఆన్‌లైన్‌లో వివిధ రకాల ల్యాప్‌టాప్‌లు లభిస్తున్నాయి. వాటిలోని ఫీచర్లపై మనకు అవగాహన ఉన్నప్పుడే ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మంచి నిర్ణయం తీసుకునే వీలుంటుంది. బెస్ట్ ఫీచర్లతో రూ.40 వేల లోపు ధరలో ఆన్ లైన్ అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌ల గురించి తెలుసుకుందాం. ఆఫీసు, వ్యక్తిగత పనులు చేసుకునేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే సామాన్యులకు అందుబాటు ధరలో లభిస్తున్నాయి.

1 / 5
హెచ్‌పీ ల్యాప్ టాప్ 15(HP laptop 15).. ఈ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల స్క్రీన్, పూర్తి స్థాయి కీబోర్డ్‌తో వస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 10 ఎంబీ కాష్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ దీని ప్రత్యేకతలు. ముఖ్యంగా 15.6 అంగుళాల స్క్రీన్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌తో పాటు ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 1.69 కేజీలు. తేలికగా ఉండడంతో ఎక్కడికైనా తీసుకువెళ్లడం చాలా సులభం. ఈ ల్యాప్ టాప్ రూ.36,990కు అందుబాటులో ఉంది.

2 / 5
లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్3(Lenovo ideapad slim3).. ఐ3 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ సాధారణ పనుల కోసం బాగా ఉపయోగపడుతుంది. దీని స్క్రీన్ పరిమాణం 15.6 అంగుళాలు. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, 8 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలు. ఈ ల్యాప్ టాప్ బరువు 1.6 కేజీలు. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్త దాదాపు 9 గంటల వరకూ వస్తుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. డాల్బీ ఆడియో కారణంగా పాటలను ఆస్వాదించవచ్చు. సుధీర్ఘ బ్యాటరీ సామర్థ్యం, స్టైలిష్ లుక్ తో ఆకట్టుకునే ఈ ల్యాప్ టాప్ ధర రూ.34,200.

3 / 5
డెల్ 14 ల్యాప్‌టాప్(Dell 14 laptop).. ప్రముఖ డెల్ బ్రాండ్ నుంచి విడుదలైన పోర్టబుల్, అత్యంత తక్కువ బరువున్న ల్యాప్ టాప్. దీని బరువు 1.5 కిలోల కంటే తక్కువ కాబట్టి ఎక్కడికి వెళ్లినా మీ ల్యాప్‌టాప్‌ని సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చు. 14 అంగుళాల స్క్రీన్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్ డీ, స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్ దీని ప్రత్యేకతలు. ఇక బ్యాటరీ సామర్థ్యం దాదాపు పది గంటల వరకూ ఉంటుంది. 1.48 కేజీల బరువైన ఈ ల్యాప్ టాప్ ధర రూ.34.990. అయితే న్యూమరిక్ కీబోర్డు లేకపోవడం మైనస్.

4 / 5
యాసర్ ఆస్పైర్(acer aspire lite).. పరిమిత బడ్జెట్‌లో అన్ని ఫీచర్లతో లభిస్తున్న ఈ ల్యాప్ టాప్ అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. 15.6 అంగుళాల స్క్రీన్, న్యూమరిక్ కీప్యాడ్‌తో సౌకర్యవంతంగా పని చేసుకోవచ్చు. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీతో సౌకర్యవంతంగా ఉంటుంది. 1.59 కేజీల బరువైన ఈ ల్యాప్ టాప్‌కు 11 గంటల వరకూ సుదీర్ఘ బ్యాటరీ సామర్థ్యం ఉంది. స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఈ ల్యాప్ టాప్ రూ.31,990 కు అందుబాటులో ఉంది.

5 / 5
అసుస్ వివోబుక్ 14(ASUS vivobook 14).. 14 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ల్యాప్ టాప్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సులభంగా తీసుకువెళ్లగలిగే వీలుంది. అలాగే రెండు రంగులలో, ఫింగర్‌ప్రింట్ రీడర్‌ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. ఈ ల్యాప్ టాప్ బరువు 1.4 కేజీలు. 180 డిగ్రీల డిజైన్, 720పీ హెచ్ డీ వెబ్‌క్యామ్, 6 గంటల వరకూ బ్యాటరీ లైఫ్ కలిగిన ఈ ల్యాప్ టాప్ ధర రూ.రూ.35,990.