రెడ్‌మీ 12 5జీ/పోకో ఎం6 ప్రో.. ఈ రెండు ఫోన్లు స్పెసిఫికేషన్ల పరంగా ఒకేలా ఉన్నాయి. కానీ డిజైన్, బ్రాండింగ్ లో విభిన్నంగా ఉన్నాయి. రెండింటిలోనూ 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన 6.79 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెడ్‌మీ 12 ధర రూ. 10,999కాగా, పోకో ఎం6ప్రో ధర రూ. 11,999గా ఉంది.