Tecno Spark 9: భారత మార్కెట్లోకి టెక్నో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 10 వేల లోపు అద్భుత ఫీచర్లు..

| Edited By: Ravi Kiran

Jul 19, 2022 | 7:57 AM

Tecno Spark 9: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ టెక్నో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసింది. టెక్నో స్పార్క్‌ 9 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ సేల్‌ జులై 23 నుంచి ప్రారంభంకానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ సందర్భంగా అందుబాటులోకి తీసుకురానున్నారు..

1 / 5
టెక్నో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో స్పార్క్‌9 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ధర రూ. 9,499గా ఉంది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ హెచ్‌డీ+ డాట్‌ డిస్‌ప్లేను అందించారు. మీడియా టెక్‌ హీలియో జీ37 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. బ్యాక్‌ కెమెరాలో ఏఐ ఎన్‌హాన్స్‌డ్‌ ఇమేజ్‌ సిస్టమ్‌ను అందించారు.

4 / 5
 ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌, డీటీఎస్‌ స్పీకర్లు అందించారు. వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం.

5 / 5
ఇందులో 6 జీబీ+128 జీబీ వంటి ఒకే ఒక స్టోరేజ్ అందించారు.  512 జీబీ వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 5GB వర్చువల్ ర్యామ్‌ కూడా ఆఫర్ చేస్తుంది.