Smartphone: స్మార్ట్‌ఫోన్ కింద ఉండే ఆ చిన్న రంధ్రం ఎందుకు? దీని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా!

Updated on: Mar 25, 2026 | 9:46 AM

Smartphone: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఫోన్‌లో కొన్ని కీలక అంశాలు ఉంటాయి. కానీ అవి అందరికి తెలియకపోవచ్చు. సాధారణంగా స్మార్ట్‌ ఫోన్‌ కింది భాగంలో చిన్నపాటి అంటే సూది కూడ దూరని విధంగా రంధ్రాలు ఉండటం మీరు చూసే ఉంటారు. ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా?

1 / 5
 Smartphone: స్మార్ట్‌ ఫోన్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. ఫోన్‌ చుట్టూ కొన్ని చిన్నపాటి రంధ్రాలు ఉండటం మీరు చూసే ఉంటారు. కానీ అవి ఎందుకు ఉంటాయి..? వాటి వల్ల ఉపయోగాలు ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. కొంత టెక్నికల్‌ అనుభవం ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. కొన్ని రంధ్రాలు సూది కూడా దూరని విధంగా ఉంటాయి. అంత చిన్నవి ఎందుకు ఉంటాయి? అనేది తెలుసుకుందాం..

2 / 5
 మనం ఉపయోగించే ప్రతి స్మార్ట్‌ఫోన్ కింద భాగంలో సూది మొన అంత పరిమాణంలో ఒక చిన్న రంధ్రం ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. చాలా మంది ఇది కేవలం మైక్రోఫోన్ అనుకుంటారు. మరికొందరు ఫోన్ రీసెట్ చేయడానికి ఇచ్చే బటన్ అని పొరబడుతుంటారు. కానీ దీని అసలు పేరు'నాయిస్ క్యాన్సలింగ్ మైక్రోఫోన్' (Noise-canceling microphone). దీని వల్ల కలిగే ఉపయోగాలు, మనం చేయకూడని పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 5
 ఇది ఎలా పనిచేస్తుంది?: మనం ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మన నోటి దగ్గర ఉండే ప్రధాన మైక్రోఫోన్ మన వాయిస్‌ని రికార్డ్ చేస్తుంది. అదే సమయంలో ఈ చిన్న రంధ్రంలో ఉండే రెండో మైక్రోఫోన్ మన చుట్టూ ఉన్న అనవసరపు శబ్దాలను (ట్రాఫిక్ సౌండ్స్, గాలి హోరు, జనాల సందడి) గ్రహిస్తుంది. ఫోన్‌లోని టెక్నాలజీ ఈ రెండు శబ్దాలను పోల్చి చూసి, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని వడకట్టేస్తుంది. దీనివల్ల అవతలి వ్యక్తికి మీ వాయిస్ చాలా స్పష్టంగా, ఎటువంటి ఆటంకం లేకుండా వినిపిస్తుంది.

4 / 5
 ఒకటి కంటే ఎక్కువ రంధ్రాలు ఎందుకు?: ప్రస్తుతం వస్తున్న ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో ఇలాంటి రంధ్రాలు రెండు లేదా మూడు కూడా ఉంటున్నాయి. ఒకటి మనం మాట్లాడే మాటలను గ్రహించడానికి.  రెండవది చుట్టూ ఉన్న శబ్దాలను తగ్గించడానికి (Noise Cancellation). మూడవది వీడియో తీసేటప్పుడు ఆ దిశలోని శబ్దాలను (Directional Audio) స్పష్టంగా రికార్డ్ చేయడానికి ఉపయోగపడతాయి.

5 / 5
 చేసే చిన్న పొరపాట్లు: ఫోన్ కవర్లు - మనం ఫోన్ అందం కోసం వాడే కొన్ని చౌకబారు మొబైల్ కవర్లు ఈ చిన్న రంధ్రాన్ని మూసివేస్తుంటాయి. అలా జరిగినప్పుడు మీరు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి ఏదో బావిలో నుండి మాట్లాడుతున్నట్లుగా అస్పష్టంగా వినిపిస్తాయి. సిమ్ ఎజెక్టర్ పిన్: ఈ రంధ్రం చూడటానికి సిమ్ కార్డ్ తీసే రంధ్రంలాగే ఉంటుంది. పొరపాటున సిమ్ పిన్‌ను ఈ మైక్రోఫోన్ రంధ్రంలో పెట్టి గుచ్చితే, లోపల ఉండే సెన్సిటివ్ మైక్రోఫోన్ పొర దెబ్బతింటుంది. ఆ తర్వాత మీ ఫోన్‌లో నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ పని చేయదు. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది చిన్నదే కావచ్చు.. కానీ మీ ఫోన్ కాల్స్ స్పష్టతలో అది కీలక పాత్ర పోషిస్తుంది.

Follow Us