Motorola Edge 50 Neo: మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలోనే..

|

Jul 15, 2024 | 9:00 PM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
 మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్5o ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

2 / 5
మోటోరాలో ఎడ్జ్‌ 50 నియో ఫోన్‌ను 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 23,999 కాగా, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించినట్లు సమాచారం.

3 / 5
ఈ ఫోన్‌ను గ్రే, బ్లూ, పోయిన్సియానా, మిల్క్ కలర్స్‌లో లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన పీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ స్క్రీన్‌ను అందించనున్నారు.

4 / 5
అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ 6879 డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.