
వన్‌ప్లస్ టీవీ Y సిరీస్ Y1S ఎడ్జ్: 43 ఇంచెస్ వన్‌ప్లస్ వై1ఎస్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ధర రూ. 25,999గా ఉంది. ఇందులో 60 Hz రిఫ్రెష్ రేట్, 178 వ్యూయింగ్ యాంగిల్‌తో FHD డిస్‌ప్లే ప్యానెల్‌ను అందించారు. రెండు హెచ్‌టీఎమ్‌ఎల్ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లను అందించారు. 24 వాట్ అవుట్‌పుట్ స్పీకర్లు ఈ టీవీ ప్రత్యేకత.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఫుల్ HD: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ 43 ఇంచెస్ రెడ్‌మీ స్మార్ట్ టీవీ రూ. 22,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీలో 20 వాట్స్ స్పీకర్‌ను అందించారు. 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, Android TV 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ పనిచేస్తుంది.

రియల్‌మీ స్మార్ట్ టీవీ X ఫుల్ HD: రియల్‌టీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఫుల్ హెచ్‌డీ టీవీలో బెజెల్-లెస్ అల్ట్రా బ్రైట్ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ టీవీ ధర రూ. 21,999కి అందుబాటులో ఉంది. 24వాట్స్ డాల్బీ ఆడియో స్టీరియో స్పీకర్‌లతో HQ క్వాలిటీ ఆడియో అందిస్తుంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ 64-బిట్ క్వాడ్-కోర్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది.

ఇన్ఫినిక్స్ X1 టీవీ: ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 టీవీలో 43 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. 24 వాట్స్ స్పీకర్ డాల్బీ ఆడియో ఈ టీవీ సొంతం. మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 23,999గా ఉంది.

Hisense A6GE అల్ట్రా HD: ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 26,990గా ఉంది. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీలో బిల్ట్-ఇన్ గూగుల్ అసిస్టెంట్‌ను అందించారు.