Galaxy A05s: సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 11 వేలకే..

|

Jan 13, 2024 | 6:40 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఓవైపు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తూనే మరోవైపు బడ్జెట్ ఫోన్‌లను సైతం లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తీసుకొచ్చి గ్యాలక్సీ ఏ05ఎస్‌ స్మార్ట్ ఫోన్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌ డిస్కౌంట్‌ పోను ఎంతకు లభిస్తుంది.? ఫీచర్లు ఎలా ఉండనున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
సౌత్‌ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఇటీవల గ్యాలక్సీ ఏ05ఎస్‌ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై అదనంగా డిస్కౌంట్‌ను ప్రకటించింది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌పై సామ్‌సంగ్‌ రూ. 2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

3 / 5
ఇక డిస్కౌంట్‌ తర్వాత ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ను రూ. 11,499కి సొంతం చేసుకోవచ్చు. అలాగే 6జీ వేరియంట్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ను రూ. 12,999కి పొందొచ్చు. సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్‌ సైట్స్‌లో ఆ ఆఫర్‌ లభిస్తోంది.

4 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 689 ప్రాసెసర్‌ను అందించారు. లైట్‌ వయలెట్, బ్లాక్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇక ఇందులో 6. 71 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగినఈ ఫోన్‌ 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.