
సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్25 అల్ట్రా పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. సామ్‌సంగ్ నుంచి వస్తున్న హై-ఎండ్ అల్ట్రా వేరియంట్‌లో భాగంగా తీసుకొస్తున్నారు.

కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందించారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌కు ఈ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే 50MP టెలిఫోటో సెన్సార్ (3x ఆప్టికల్ జూమ్), 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ (5x ఆప్టికల్ జూమ్) వంటి కెమెరానలను ఇవ్వనున్నారు.

బ్యాటరీ విషయానికొస్తే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. గ్యాలక్సీ ఎస్24కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక ధర విషయానికొస్తే సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్25 అల్ట్రా 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,20,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.