Redmi note 11 SE: రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. కెమెరా ప్రత్యేకత తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

|

Aug 24, 2022 | 7:16 PM

Redmi note 11 SE: రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ 11 ఎస్‌ఈ పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 26న లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ నోట్‌ 11 ఎస్‌ఈ పేరుతో తీసుకొస్తు్న్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను ఇవ్వనున్నారు.

2 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో  6.43 ఇంచెస్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఫుల్‌ హెచ్‌డీ + స్క్రీన్‌ను అందించనున్నారు. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటక్షన్‌ను అందించారు.

3 / 5
రెడ్‌మీ 11 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ Mali-G76 GPUతో, Helio G95 SoC ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

4 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 13 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. రెయిర్‌ కెమెరాతో 4K వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

5 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33W ఫాస్ట్ చార్జింగ్‌‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మొత్తం మూడు వెరియంట్లలో తీసుకొచ్చారు. 6GB RAM + 64GB మెమరీ, 6GB RAM + 128GB మెమరీ, 8GB RAM + 128GB మెమరీ వేరియంట్లలో లాంచ్‌ చేయనున్నారు.