Realme GT Neo 3: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో రానున్న తొలి ఫోన్‌ ఇదే..

|

Mar 19, 2022 | 8:50 PM

Realme GT Neo 3: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ జీటీ నియో 3 మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. 150 వాట్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో విడుదల కానున్న ఈ ఫోన్‌ను మార్చి 22న విడుదల చేయనున్నారు..

1 / 5
 ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. రియల్‌మీ జీటీ నియో 3 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌లో మార్చి 22న విడుదల చేయనున్నారు. తొలుత చైనాలో విడుదల కానున్న ఈ ఫోన్‌ను తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

2 / 5
రియల్‌మీ జీటీ నియో 3 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించనున్నారు. 150 వాట్స్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌లో 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్‌ అవుతుంది.

3 / 5
రియల్‌మీ జీటీ నియో 3 ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. సోనీ IMX766 సెన్సార్​ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకగా చెబుతున్నారు.

4 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.5 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

5 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 30 వేల లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ధరకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.