చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. నార్జో ఎన్55 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను ఏప్రిల్ 12న లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానుంది.
ఇదిలా ఉంటే కంపెనీ ఈ ఫోన్ లుక్‌ను విడుదల చేసినా ఇప్పటి వరకు ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే నెట్టింట వైరల్ అవుతోన్న కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-టోన్ డిజైన్, వెనుక రెండు కెమెరాలు ఉండనున్నాయి. పవర్ బటన్‌ను ఫింగర్‌ప్రింట్ స్కానర్‌గా కూడా వినియోగించే అవకాశం ఉంటుంది.
మీడియాటెక్ జీ88 చిప్‌సెట్‌తో రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో సూపర్ వూక్ ఛార్జింగ్ టెక్నిక్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ కేవలం 29 నిమిసాల వ్యవధిలోనే 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
ఏఐ ఫేస్ అన్‌లాక్ వంటి అధునాతన ఫీచర్స్‌ను అందిస్తున్నట్లు సమాచారం. 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్‌సీ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించనున్నారు. ధర విషయానికొస్తే రూ. 12 నుంచి రూ. 15 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.